...
...
Next Story

RGUKT Admissions 2026 : ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ, బీటెక్ అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

RGUKT Admissions 2026 : రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీ(IIIT) క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల సమీకృత బీటెక్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ముఖ్యమైన తేదీలు చూసుకుని ఫాలో అవ్వాలి.

Published on: May 2, 2026, 17:57:52 IST
Advertisement

టెన్త్ పూర్తి కాగానే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంజినీరింగ్ వైపు చదివేందుకు గోల్డెన్ ఛాన్స్ మీకోసం ఎదురుచూస్తోంది. ఏపీలోని నూజివీడు, ఆర్.కె వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ ఖరారైంది.

సీట్ల వివరాలు

  • మొత్తం సీట్లు: 4,400 (ఒక్కో క్యాంపస్‌లో 1,100 సీట్లు).
  • ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో 10 శాతం సీట్ల భర్తీ ఉంటుంది.

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లు (wikipedia)
ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లు (wikipedia)

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం 'డిప్రివేషన్ స్కోర్' అదనంగా కలిపి ప్రాధాన్యతనిస్తారు. అంటే పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు అదనంగా 4 శాతం మార్కులు కలుపుతారు.

మొదటి రెండేళ్లు పీయూసీ (PUC) (M.P.C / M.Bi.P.C), ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్ ఉంటుంది. విద్యార్థులు కావాలనుకుంటే పీయూసీ తర్వాత బయటకు వెళ్లవచ్చు.

కోర్సుల వివరాలు

  • కంప్యూటర్ సైన్స్ (CSE), సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (EEE), ఎలక్ట్రానిక్స్ (ECE).
  • కొత్తగా 'ఏఐ అండ్ ఎంఎల్' (AI & ML) తో కూడిన కంప్యూటర్ సైన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉంది.
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ కేవలం నూజివీడు, ఆర్.కె వ్యాలీ క్యాంపస్‌లలో మాత్రమే ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: మే 01, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: మే 30, 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫలితాల ప్రకటన: జూన్ 12, 2026 (తాత్కాలిక మెరిట్ జాబితా)
  • ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 19 నుండి జూన్ 23 వరకు (క్యాంపస్‌ల వారీగా ఉంటుంది)
  • నూజివీడు : 19-06-2026, 20-06-2026 వరకు.
  • ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ): జూన్‌ 19, 20 తేదీలు.
  • ఒంగోలు : జూన్‌ 22, 23.
  • శ్రీకాకుళం : జూన్‌ 22, 23.

దరఖాస్తు ఫీజు

  • ఎస్సీ (SC), ఎస్టీ (ST) విద్యార్థులకు: రూ. 250/-
  • మిగిలిన వారికి: రూ. 400/-

ఎంపిక విధానం

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్పెషల్ కేటగిరీ విద్యార్థులు (NCC, Sports, CAP, Scouts) జూన్ 5 నుండి 8 వరకు నూజివీడు క్యాంపస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks