ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందకు ఇదే సరైన సమయమని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని... పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న 30 సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అలాగే ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రాగంణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు…. ఉప రాష్ట్రపతిని అల్పాహార విందుకు ఆహ్వానించారు.
సభా ప్రాంగణంలోని ప్లీనరీ హాల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సభలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ...”ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోంది. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోంది. అభివృద్ధికి - సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారు" అని చెప్పారు.
ఇదే సరైన సమయం - ఉపరాష్ట్రపతి
“దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఈ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయి. టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అనుకూల సమయం ఉంది” అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
{{/usCountry}}“దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఈ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయి. టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అనుకూల సమయం ఉంది” అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
{{/usCountry}}"వచ్చే రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుంది. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తాం. ప్రతీ దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుంది. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిది. ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదం.”అని ఉప రాష్ట్రపతి అన్నారు.
గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ - కేంద్రమంత్రి గోయల్
ఈ ప్రారంభోత్సవ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ...”ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు యావత్ భారత దేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే... వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందే. గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం అవుతుంది" అని చెప్పారు.
ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్… ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. అలాగే ఏపీ పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి అనువైన వాతావరణం కల్పిస్తుందోననే అంశాలను వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారత దేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయని అన్నారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని వివరించారు.