ఎల్‌నినో ప్రతికూల ప్రభావం కారణంగా రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. వర్షాలు లేక ఎండల తీవ్రత రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతోంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో అప్పుడే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శనివారం అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో ఎండల ధాటికి భక్తులు, స్థానికులు తీవ్ర తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు లేక వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
మంత్రాలయం-38.4 డిగ్రీలు(రాయలసీమలోనే అత్యధికం), పాన్యం (నంద్యాల జిల్లా) 38.3 డిగ్రీలు, పగిడ్యాల 38.2 డిగ్రీలు, ఉయ్యాలవాడ 38.0 డిగ్రీలు, కొత్తపల్లె, దోర్నిపాడు 37.9, కర్నూలు రూరల్ 37.7 డిగ్రీలు, కోడుమూరు 37.4 డిగ్రీలు, కల్లూరు 37.1 డిగ్రీలు, కర్నూలు అర్బన్ 36.8 డిగ్రీలు, వెల్దుర్తి 36.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ భానుడి ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లనూరు తాడిపత్రి 37.2 డిగ్రీలు, అనంతపురం అర్బన్: 37.0 డిగ్రీలు, తలుపుల (శ్రీ సత్యసాయి జిల్లా) 37.0 డిగ్రీలు, పుట్లూరు, కళ్యాణదుర్గం 36.8 డిగ్రీలు, కదిరి 36.8 డిగ్రీలు, విడపనకల్లు, తనకల్లు, నంబూలపూలకుంట 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వర్షాభావం వల్ల గాలిలో తేమ శాతం తగ్గి, భూతాపం విపరీతంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమలో విస్తారంగా సాగయ్యే ఉద్యానవన పంటలపై ఈ వేడిగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రాయలసీమకు పేరుగాంచిన బత్తాయి తోటలు నీటి కొరత, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. పూత, పిందె దశలోనే రాలిపోయే ప్రమాదం ఏర్పడింది.
అధిక వేడి వల్ల పిందెలు నిలవక దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటిమట్టం పడిపోయి, ఉన్న తోటలను కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. వాతావరణ మార్పుల దృష్ట్యా ఉద్యానవన శాఖ అధికారులు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు, బిందు సేద్యం పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}అధిక వేడి వల్ల పిందెలు నిలవక దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటిమట్టం పడిపోయి, ఉన్న తోటలను కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. వాతావరణ మార్పుల దృష్ట్యా ఉద్యానవన శాఖ అధికారులు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు, బిందు సేద్యం పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}