Tirumala Darshan Timing : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, తిరుమలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. గత కొన్నిరోజులుగా కిటకిటలాడిన క్యూలైన్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా…. టీటీడీ అధికారులు భక్తులను నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.

ఉదయం 8 గంటల తర్వాత వచ్చిన భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనం ద్వారా వెళ్లే భక్తులకు కూడా సుమారు 4 గంటల్లోనే స్వామివారి దివ్య మంగళ స్వరూప దర్శనం లభిస్తోంది. ఉత్సవాల వేళ ఇంత తక్కువ సమయంలో స్వామివారి దర్శనం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న తిరుమలలో నమోదైన గణాంకాలు:
తిరుమలేశుని దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ రోజువారీ గణాంకాలను వెల్లడించింది. నిన్న (సోమవారం) ఒక్క రోజే మొత్తం 88,210 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాల సమర్పణ కార్యక్రమం కింద 30,192 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి ఒక్కరోజే రూ. 4.23 కోట్ల భారీ ఆదాయం లభించింది. ప్రసాదాల విక్రయాలకు సంబంధించి నిన్న ఒక్కరోజే భక్తులు 4.36 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. భక్తుల ఆకలి తీర్చే నిత్యాన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా 2.67 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే తిరుమలలోని అశ్విని ఆసుపత్రి వైద్య సేవలను 3,398 మంది భక్తులు వినియోగించుకున్నారు.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో కంపార్టుమెంట్లు ఏవీ నిండకుండా నేరుగా లైన్లలోకి భక్తులను పంపుతున్నారు. ఈ రద్దీ లేని వాతావరణం శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది.
{{/usCountry}}ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో కంపార్టుమెంట్లు ఏవీ నిండకుండా నేరుగా లైన్లలోకి భక్తులను పంపుతున్నారు. ఈ రద్దీ లేని వాతావరణం శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది.
{{/usCountry}}