...
...
Next Story

కోరుకొండ సైనిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి!

సైనిక్ స్కూల్ కోరుకొండ PTI(Physical Training Instructor) 2026 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jan 25, 2026, 18:45:37 IST
Advertisement

సైనిక్ స్కూల్ కోరుకొండ పీటీఐ కమ్ మాట్రన్ పోస్టు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైనిక్ స్కూల్ కోరుకొండ అధికారిక వెబ్‌సైట్ చూసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 13 ఫిబ్రవరి 2026గా నిర్ణయించారు.

  • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 24-01-2026
  • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 13-ఫిబ్రవరి-2026
  • అధికారిక వెబ్‌సైట్: sainikschoolkorukonda.org

కోరుకొండ సైనిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్
కోరుకొండ సైనిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్

సైనిక్ స్కూల్ కోరుకొండ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీ, DPEd పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 31-01-2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. పీటీఐ & మాట్రన్‌ 1 పోస్టుకు(మహిళా) సంబంధించి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు ( www.sainikschoolkorukonda.org ) అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తును సమర్పించాలి . పూర్తి చేసిన దరఖాస్తును ఈ చిరునామాకు పంపాలి: ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, పీఓ: సైనిక్ స్కూల్ కోరుకొండ, జిల్లా: విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535214. 13-ఫిబ్రవరి-2026లోపు పంపాలి.

అభ్యర్థులు మార్కుల పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్లు, అనుభవ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాల స్వీయ-ధృవీకరించిన కాపీలను జతచేయాలి. అన్ రిజర్వ్‌డ్ కేటగిరీకి రూ.5000/- డిమాండ్ డ్రాఫ్ట్ దరఖాస్తుతో పాటు జతపరచాలి. 21 రోజులలోపు దరఖాస్తు, అవసరమైన అన్ని పత్రాలు, డీడీతో సహా పాఠశాలకు చేరాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ముందుగా సైనిక్ స్కూల్ కోరుకొండ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2026 ని క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థి అర్హత ప్రమాణాలను చూసుకోవాలి. కమ్యూనికేషన్ చేసేందుకు సరైన ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి. ఐడీ ప్రూఫ్, వయస్సు, విద్యార్హత, ఇటీవలి ఫోటోగ్రాఫ్, రెజ్యూమ్, ఏదైనా అనుభవం ఉంటే మొదలైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks