తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి.. ఆర్మీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆర్మీ, తెలంగాణ మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతరం చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన 'సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్' జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ - ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.
దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


