శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో కృష్ణానది బ్యాక్‌వాటర్ ఉద్ధృతి పెరిగింది. దీని ప్రభావంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వరాలయం మరోసారి నీట మునిగింది. జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణాన్ని కృష్ణానది జలాలు పూర్తిగా చుట్టుముట్టాయి.

ఆలయం చుట్టూ నీరు చేరుకుంటున్న తరుణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ నది తల్లిని శాంతింపజేసేలా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరెసారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నది దేవత ఆశీస్సుల కోసం వేడుకుంటూ విశేష పూజాధికాలు నిర్వహించారు. కృష్ణమ్మ ప్రవాహం మరింత ఉద్ధృతంగా మారుతుండటంతో, వేపదారు శివలింగం రాబోయే కొన్ని రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండే అవకాశం ఉందని పూజారులు వెల్లడించారు. దీంతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణా, తుంగభద్ర తదితర నదుల సంగమ ప్రాంతంలో వెలసిన ఈ సంగమేశ్వరాలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్ నిండే కొద్దీ ఈ ఆలయం నీట మునిగిపోవడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన ప్రతిసారీ ఈ ఆలయం పూర్తిగా జలమగ్నం కావడం వల్ల, ఏటా కొన్ని నెలల పాటు భక్తులకు గర్భాలయంలోని శివలింగ దర్శనం లభించదు. అయినప్పటికీ ఈ దృశ్యాన్ని తిలకించడానికి, నది మధ్యలో ఆలయం మునిగిపోతున్న వైవిధ్యాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
ఆలయం నీట మునిగిపోవడంతో ప్రస్తుతం గర్భాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా మారుతున్నందున నదిలోకి దిగవద్దని అధికారులు స్థానిక ప్రజలను, పర్యాటకులను హెచ్చరించారు. శ్రీశైలం జలాశయ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున, రానున్న రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం తగిన భద్రతా చర్యలు చేపట్టింది. నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
{{/usCountry}}ఆలయం నీట మునిగిపోవడంతో ప్రస్తుతం గర్భాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా మారుతున్నందున నదిలోకి దిగవద్దని అధికారులు స్థానిక ప్రజలను, పర్యాటకులను హెచ్చరించారు. శ్రీశైలం జలాశయ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున, రానున్న రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం తగిన భద్రతా చర్యలు చేపట్టింది. నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
{{/usCountry}}గత సంవత్సరం జూన్ 15వ తేదీన సంగమేశ్వర స్వామి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఈ ఏడాది ఆగస్టు 1న నీరు వచ్చిందని ఆలయ అర్చకులు వెల్లడించారు. గతేడాది జూన్ 15వ తేదీన స్వామివారు జలాధివాసం కాగా.. తిరిగి మార్చి నెలలో నీరు తగ్గి ఆలయం బయటపడింది. దీంతో భక్తులు సంగమేశ్వర ఆలయం వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మార్చి నెల నుంచి ఆగస్టు వరకు సుమారు 131 రోజులు స్వామివారు పూజలు అందుకున్నారు.