Heroine: గుడిలో సన్ గ్లాసెస్‌తో శివుడికి హీరోయిన్ భూమి పూజలు.. ఆడేసుకున్న నెటిజన్లు.. కనీసం ఆ సంస్కారం లేదా అంటూ!

Bhumi Pednekar Prays Lord Shiva Wearing Sunglasses: శ్రావణ మాసం సందర్భంగా శివాలయంలో నల్ల కళ్లజోడు పెట్టుకుని అభిషేకం చేసిన బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారా, కనీసం ఆ సంస్కారం లేదా అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Published on: Jul 30, 2026, 19:04:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhumi Pednekar Prays Lord Shiva Wearing Sunglasses: బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడం వల్ల శివాలయానికి వెళ్లిన ఆమె, నల్ల కళ్లజోడు (సన్ గ్లాసెస్) ధరించి శివలింగానికి నీటితో అభిషేకం చేశారు.

గుడిలో సన్ గ్లాసెస్‌తో శివుడికి హీరోయిన్ భూమి పూజలు.. ఆడేసుకున్న నెటిజన్లు.. కనీసం ఆ సంస్కారం లేదా అంటూ!
గుడిలో సన్ గ్లాసెస్‌తో శివుడికి హీరోయిన్ భూమి పూజలు.. ఆడేసుకున్న నెటిజన్లు.. కనీసం ఆ సంస్కారం లేదా అంటూ!

భూమి పెడ్నేకర్ వీడియో వైరల్

ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమి పెడ్నేకర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన భూమి, కళ్లకు బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న భూమి ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.

ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే

"శ్రావణ మాసం ప్రారంభమైన వేళ, నా జీవితం సులువుగా మారిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నా. హర్ హర్ మహాదేవ్" అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు హీరోయిన్ భూమి పెడ్నేకర్.

భక్తి పేరిట ఫొటోషూటా?

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్లు భూమి పెడ్నేకర్‌ను ఆడేసుకుంటున్నారు. గుడిలోకి వెళ్లేటప్పుడు, దేవుడికి పూజ చేసేటప్పుడు కనీసం సన్ గ్లాసెస్ తీసే సంస్కారం లేదా అని ప్రశ్నిస్తున్నారు. "దేవుడి ముందు భక్తి శ్రద్ధలు చూపుతున్నారా లేక ప్రమోషనల్ ఫొటోషూట్ చేసుకుంటున్నారా?" అని ఒక నెటిజన్ నిలదీశారు.

వరద బాధితులకు సాయం కోరిన భూమి

"గుడిలో కూడా కళ్లజోడు పెట్టుకుని పూజలు చేసే వారిని నేనెప్పుడూ చూడలేదు" అని మరొకరు కామెంట్ చేశారు. అయితే, ఈ విమర్శలపై భూమి ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇటీవల అస్సాంలో సంభవించిన తీవ్ర వరదలపై భూమి పెడ్నేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి అందరూ ముందుకురావాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు.

సీఎం నుంచి అభినందనలు

"ప్రస్తుతం అస్సాం తీవ్ర సంక్షోభంలో ఉంది. వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయాయి. వారికి ఆహారం, వైద్య సదుపాయాలు తక్షణమే అందాలి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలు ఇవ్వాలి" అని భూమి విజ్ఞప్తి చేశారు. ఆమె చొరవను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం కూడా అభినందించింది.

వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు

'దమ్ లగా కే హైషా' చిత్రంతో ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన భూమి, మొదటి సినిమా నుంచే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 'దల్‌దల్' సిరీస్‌లో భూమి యాక్ట్ చేసింది.

ట్రోలర్ల బారిన భూమి పెడ్నేకర్

ఓటీటీ సిరీస్ లో డీసీపీ రీటా ఫెర్రేరియాగా సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించి వీక్షకులను ఆకట్టుకున్నారు. సామాజిక అంశాలపై నిత్యం స్పందించే ఈ భామ, గుడిలో కళ్లజోడు వ్యవహారంలో మాత్రం ట్రోలర్ల బారిన పడటం గమనార్హం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More