Serial Heroine: రాత్రి 11 గంటలకు ఇంట్లోంచి గెంటేశారు, భుజానికి కుట్లు కూడా విప్పలేదు.. సీరియల్ హీరోయిన్ శిల్పా కామెంట్స్
Serial Heroine Shilpa Shinde On Family: బుల్లితెర సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ విజేత శిల్పా షిండే తన జీవితంలోని అత్యంత విషాదకర అధ్యాయాన్ని పంచుకున్నారు. భుజానికి శస్త్రచికిత్స జరిగిన ఐదో రోజే సొంత కుటుంబ సభ్యులు ఇంట్లోంచి గెంటేస్తే అనాథలా మారానని బుల్లితెర నటి శిల్పా కన్నీటిపర్యంతమయ్యారు.
Serial Heroine Shilpa Shinde On Family Issues: 'భాబీజీ ఘర్ పరి హై' సీరియల్‌లో అంగూరీ భాబీగా దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొంది, బిగ్ బాస్ 11 విజేతగా నిలిచిన టీవీ హీరోయిన్ శిల్పా షిండే జీవితంలో ఊహించని విషాదం దాగుంది.

మానసిక క్షోభ అనుభవించినట్లు
తెరపై నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ అందరినీ నవ్వించే ఈ నటి, నిజ జీవితంలో సొంత కుటుంబం నుంచే తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'లాక్ అప్' రియాలిటీ షోలో ఆమె వెల్లడించిన చేదు నిజాలు అభిమానులను, నెటిజన్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
రాత్రి 11 గంటలకు ఇంట్లోంచి బయటకు..
ఈ ఓటీటీ షోలో నామినేషన్ల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తోటి పోటీదారు శివాంగి జోషి ఒత్తిడి మేరకు శిల్పా తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. మూడేళ్ల క్రితం తనకు భుజానికి సర్జరీ జరిగిన సమయంలో తనను ఇంట్లోంచి కుటుంబ సభ్యులే గెంటేసినటువంటి దారుణ పరిస్థితులను శిల్పా గుర్తు చేసుకున్నారు.
ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు
తమ్ముడు తన భార్య మాటలు విని ఇంట్లో గొడవలు సృష్టించాడని, తమ్ముడి ప్రభావంలో పడ్డ తల్లి కూడా తనకు అండగా నిలవలేదని శిల్పా ఆవేదన వ్యక్తం చేశారు. భుజానికి కుట్లు కూడా విప్పని సమయంలో, సర్జరీ జరిగిన ఐదో రోజే రాత్రి 11 గంటలకు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సొంత ఇల్లు వదిలి బయటకు వచ్చేసినట్లు తెలిపారు.
"కుటుంబమున్నా నేను అనాథనే"
తన సొంత మనుషులే తనను తీవ్రంగా వాడుకుని పక్కన పడేశారని శిల్పా ఆవేదన చెందారు. "చాలామందికి కుటుంబం ఉండదు. కానీ నాకు కుటుంబం ఉన్నా నేను అనాథగానే బతుకుతున్నాను. నేను ఏ సానుభూతి కోసం ఈ విషయాలు చెప్పడం లేదు" అని శిల్పా షిండే కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి
ముంబైకి వచ్చిన ప్రతిసారీ హోటళ్లలో లేదా షెల్టర్ హోమ్‌లలో ఉంటున్నానని, ప్రశాంతత కోసం కర్జత్‌లోని నివాసానికి మారిపోయానని చెప్పారు. ముంబైలో హోటల్‌లో దిగినప్పుడు బంధువులు వచ్చారని అబద్ధం చెబుతానని, కానీ అసలు నిజం ఏంటంటే కుటుంబంతో సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని శిల్పా స్పష్టం చేశారు.
డోర్‌మాట్‌లా మారిపోయాను
ఆఖరికి తన ఆస్తి విల్లులో కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కు లేకుండా రాసేశానని శిల్పా షిండే వెల్లడించారు. సొంత కుటుంబంలో తాను ఒక కాళ్ల తుడుపు గుడ్డలా (డోర్‌మాట్) మారిపోయానని, అందరూ తనను వాడుకుని వదిలేశారని వాపోయారు.
షెల్టర్ హోమ్ నిర్మించడమే జీవితాశయం
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేలా ఒక పెద్ద షెల్టర్ హోమ్ నిర్మించడమే తన జీవిత లక్ష్యమని, ఆ కల నెరవేర్చుకోవడానికే ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానని చెప్పారు.
టాక్సిక్ అని విమర్శించినా పట్టించుకోను
జనాలు తనను 'టాక్సిక్' అని విమర్శించినా పట్టించుకోనని, ఈ చేదు అనుభవాలే తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని ధైర్యంగా తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


