అదనపు రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీద నుంచి వెళ్తాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఈ ట్రైన్ ఉపయోగపడనున్నాయి. కోయంబత్తూరు – జైపూర్, బాంద్రా టెర్మినల్ – వేళంకన్ని, పూరీ – సోలాపూర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుస్తాయి.
కోయంబత్తూర్ - జైపూర్
ట్రైన్ నెంబర్ 06181/06182 కోయంబత్తూర్ - జైపూర్ - కోయంబత్తూర్ వీక్లీ ప్రత్యేక రైళ్లు 08 సర్వీసులు నడుస్తాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ దాకా నడవనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, ధోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కమరెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందెడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోలా మల్కాపూర్, భుసావల్, జల్గావ్, ధరన్‌గావ్, నందుర్‌బార్, ఉద్నా, భరూచ్, వడోదర, గోద్రా, రత్లాం, జయోరా, మాంద్‌సోర్, నిమాచ్, చిత్తౌర్‌గఢ్, భిల్వారా, బీజైనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్‌గఢ్ స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో పూర్తిగా 3ఏసీ కోచ్‌లు ఉంటాయి.
బాంద్రా – వేళంకన్ని
రైలు నెంబర్ 09059/09060 బాంద్రా – వేళంకన్ని – బాంద్రా వీక్లీ స్పెషల్ ట్రైన్ 04 సర్వీసులు నడుస్తాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ దాకా నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు బోరివలి, వాసాయి రోడ్, పన్వెల్, కర్జాత్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూర్, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలదుతురై, నాగపట్టినం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
పూరి-షోలాపూర్
ట్రైన్ నెంబర్ 08445 పూరి - షోలాపూర్ వన్ వే స్పెషల్ ట్రైన్ ఆగస్టు 7వ తేదీన ఒక సర్వీస్ నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, కలబురగి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
{{/usCountry}}ట్రైన్ నెంబర్ 08445 పూరి - షోలాపూర్ వన్ వే స్పెషల్ ట్రైన్ ఆగస్టు 7వ తేదీన ఒక సర్వీస్ నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, కలబురగి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
{{/usCountry}}