Trains Diversions : ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో ప్రయాణించే పలు రైళ్లు మళ్లింపు

Trains Diversions : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్టుగా ప్రకటించింది.

Published on: Aug 3, 2026, 15:32:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ మౌలిక వసతుల మెరుగుదల పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు కీలక రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే పలు సర్వీసులపై ఈ ప్రభావం ఉండనుంది.

ట్రైన్స్ దారి మళ్లింపు
ట్రైన్స్ దారి మళ్లింపు

రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఈ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపడుతున్నారు. హైదరాబాద్, చర్లపల్లి, మైసూర్ నుండి బీహార్‌లోని దర్భంగా, రక్సాల్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను రూపకల్పన చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మళ్లించిన రైళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

17005 హైదరాబాద్ – రక్సాల్ 24.09.2026 తేదీన కియుల్ – మోంగీర్ - బరౌని నుంచి మళ్లింపు.

17008 దర్భంగా – చర్లపల్లి 25.09.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లింపు.

12578 మైసూర్ – దర్భంగా 25.09.2026 తేదీన దానాపూర్ – పాట్లీపుత్ర – ముజఫ్ఫర్‌పూర్ – సమస్తిపూర్ నుంచి మళ్లింపు.

17007 చర్లపల్లి – దర్భంగా 26.09.2026 రోజున కియుల్ – మోంగీర్ – బరౌని నుంచి దారి మళ్లింపు.

17007 చర్లపల్లి – దర్భంగా 29.09.2026 తేదీన కియుల్ – మోంగీర్ – బరౌని నుంచి మళ్లింపు.

12577 దర్భంగా – మైసూర్ 29.09.2026 సమస్తిపూర్ – ముజఫ్ఫర్‌పూర్ – పాట్లీపుత్ర – దానాపూర్ నుంచి మళ్లింపు.

17005 హైదరాబాద్ – రక్సాల్ 01.10.2026 రోజున కియుల్ – జామాల్‌పూర్ – మోంగీర్ నుంచి మళ్లింపు.

17008 దర్భంగా – చర్లపల్లి 02.10.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లింపు.

17006 రక్సాల్ – హైదరాబాద్ 04.10.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లిస్తారు.

రైళ్లు వేరే మార్గంలో మళ్లించటం వలన సాధారణ సమయం కంటే కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కావున ప్రయాణికులు కింద పేర్కొన్న నిబంధనలను పరిశీలించవలసిందిగా సూచించారు. మళ్లించిన మార్గాల్లో కొన్ని రెగ్యులర్ స్టేషన్లలో రైళ్లు ఆగకపోవచ్చు. మళ్లించిన రూట్లలో ప్యాసింజర్ల రద్దీని బట్టి తాత్కాలిక సాంకేతిక స్టాప్‌లు కేటాయించే అవకాశం ఉంది.

రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నందున గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో మార్పులు ఉంటాయి. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు రైల్వే అధికారిక యాప్ ‘National Train Enquiry System’ (NTES) ద్వారా కానీ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రైలు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు.

పైన పేర్కొన్న తేదీల్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు వారి మొబైల్ నంబర్లకు ఐఆర్‌సిటీసీ ద్వారా సందేశాలు వస్తాయి. ప్రయాణికులు ఈ సమాచారాన్ని గమనించి రైల్వే శాఖకు సహకరించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More