ఏపీ ప్రయాణికులకు శుభవార్త - రాయలసీమ మీదుగా ప్రత్యేక రైళ్లు, హాల్ట్ లిస్టులో అరుణాచలం..!
వేళాంకన్ని పండుగ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ - వేళాంకన్ని మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.
ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం వేలంకన్నిలో జరగనున్న వార్షిక పండుగ మహోత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు రద్దీని అధిగమించేందుకు ముంబైలోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ , వేళాంకణ్ణి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పలు వివరాలను వెల్లడించింది.

ఈ ప్రత్యేక సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మిక భక్తులకు, ప్రయాణికులకు వేలంకన్నికి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది.
లోక్‌మాన్య తిలక్ – వేలంకన్ని (ట్రైన్ నంబర్: 01161) :
- ఈ ప్రత్యేక రైలు (01161) లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ నుంచి ఉదయం 11:50 గంటలకు బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 02:00 గంటలకు వేలంకన్నికి చేరుకుంటుంది.
- ఆగస్టు 26, 2026 (బుధవారం) మరియు సెప్టెంబర్ 07, 2026 (సోమవారం) తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మొత్తం 2 ట్రిప్పులు నడుస్తాయి.
వేళాంకణ్ణి – లోక్‌మాన్య తిలక్ (ట్రైన్ నంబర్: 01162) :
- తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు (01162) వేళాంకణ్ణి నుంచి ఉదయం 05:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 16:40 (4:40) గంటలకు లోక్‌మాన్య తిలక్ టెర్మినస్‌కు చేరుకుంటుంది.
- ఆగస్టు 28, 2026 (శుక్రవారం) మరియు సెప్టెంబర్ 09, 2026 (బుధవారం) తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా మొత్తం 2 ట్రిప్పులు నడుస్తాయి.
ఆగే స్టేషన్లు - లిస్టులో అరుణాచలం
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో ఠాణే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, సోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై(అరుణాచలం), విల్లుపురం, మయిలాడుతురై జంక్షన్, నాగపట్నం స్టేషన్లు ఉన్నాయి.
భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుకూలమైన కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఇందులో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్ , స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లను ఏర్పాటు చేశారు.
పండుగ రద్దీ దృష్ట్యా వేళాంకణ్ణి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని… ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

