Special Trains : ఏపీ, తెలంగాణ మీదుగా వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు
Weekly Special Trains : భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి ఏపీ, తెలంగాణ మీదు నడవనున్నాయి.
అదనపు రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీద నుంచి వెళ్తాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఈ ట్రైన్ ఉపయోగపడనున్నాయి. కోయంబత్తూరు – జైపూర్, బాంద్రా టెర్మినల్ – వేళంకన్ని, పూరీ – సోలాపూర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుస్తాయి.
కోయంబత్తూర్ - జైపూర్
ట్రైన్ నెంబర్ 06181/06182 కోయంబత్తూర్ - జైపూర్ - కోయంబత్తూర్ వీక్లీ ప్రత్యేక రైళ్లు 08 సర్వీసులు నడుస్తాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ దాకా నడవనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, ధోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కమరెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందెడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోలా మల్కాపూర్, భుసావల్, జల్గావ్, ధరన్‌గావ్, నందుర్‌బార్, ఉద్నా, భరూచ్, వడోదర, గోద్రా, రత్లాం, జయోరా, మాంద్‌సోర్, నిమాచ్, చిత్తౌర్‌గఢ్, భిల్వారా, బీజైనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్‌గఢ్ స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో పూర్తిగా 3ఏసీ కోచ్‌లు ఉంటాయి.
బాంద్రా – వేళంకన్ని
రైలు నెంబర్ 09059/09060 బాంద్రా – వేళంకన్ని – బాంద్రా వీక్లీ స్పెషల్ ట్రైన్ 04 సర్వీసులు నడుస్తాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ దాకా నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు బోరివలి, వాసాయి రోడ్, పన్వెల్, కర్జాత్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూర్, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలదుతురై, నాగపట్టినం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
పూరి-షోలాపూర్
ట్రైన్ నెంబర్ 08445 పూరి - షోలాపూర్ వన్ వే స్పెషల్ ట్రైన్ ఆగస్టు 7వ తేదీన ఒక సర్వీస్ నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, కలబురగి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


