రైల్వే ప్రయాణికులకు అలర్ట్... కాకినాడ - మైసూర్ మధ్య కొత్తగా వీక్లీ రైలు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల లిస్ట్
SCR Kakinada - Mysore Train : దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాకినాడ టౌన్ - మైసూర్ మధ్య కొత్త బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17289/17290) రైలును ప్రారంభించనుంది. మే 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది.
South Central Railway New Trains : తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.... ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ టౌన్ నుంచి కర్ణాటకలోని మైసూర్ వరకు కొత్త బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (Train Nos. 17289/17290) అందుబాటులోకి తెచ్చింది. గతంలో స్పెషల్ ట్రైన్ సర్వీసుగా (07033/07034) కొనసాగిన ఈ సర్వీసును రైల్వే బోర్డు ఇప్పుడు క్రమబద్ధీకరించి.... శాశ్వత ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చింది.

ఈ కొత్త రైలు సర్వీసులు మే నెల ప్రారంభం నుంచి పట్టాలెక్కనున్నాయి. బయల్దేరే సమయం, ఆగే స్టేషన్లు, ఇతర వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి....
- కాకినాడ టౌన్ - మైసూర్ ఎక్స్‌ప్రెస్ (17289): ఈ రైలు మే 1, 2026 నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
- మైసూర్ - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (17290): ఈ రైలు మే 2, 2026 నుంచి ప్రతి మంగళవారం, శనివారం ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
కాకినాడ టౌన్‌లో ఉదయం 09:00 గంటలకు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 16:00 గంటలకు మైసూర్ చేరుకుంటుంది. మైసూరు నుంచి ప్రారంభమయ్యే రైలు.... సాయంత్రం 5.05కు బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు రాత్రి 11.30కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలోని పలు కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ రైళ్లు... కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్ లో స్టేషన్లలో ఆగుతాయి.
ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని పారిశ్రామిక నగరాలైన బెంగళూరు, మైసూర్ మధ్య అనుసంధానం మరింత మెరుగుపడనుంది. ఈ రైలు ప్రవేశపెట్టడం వల్ల అటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు పర్యాటకులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది,
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

