...
...
Next Story

ఈ తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు.. లిస్టులో విశాఖపట్నం-కాచిగూడ కూడా.. పూర్తి షెడ్యూల్

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. మూడు వన్ వే స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది. వాటి పూర్తి షెడ్యూల్ ఇదే..

Published on: May 28, 2026, 13:14:18 IST
Advertisement

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ ప్రాంతాల మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి. ఈ వన్-వే ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసులు, స్టాప్‌ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

విశాఖపట్నం-కాచిగూడ(ట్రైన్ నెం. 08521)

3 ప్రత్యేక రైళ్లు
3 ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం-కాచిగూడ ట్రైన్ 30.05.2026వ తేదీన విశాఖలో బయల్దేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 05:30 గంటలకు ప్యాసింజర్ బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ఆగుతుంది.

బిలాస్‌పూర్-పోడనూర్(ట్రైన్ నెం. 08201)

బిలాస్‌పూర్-పోడనూర్ ట్రైన్ 28.05.2026 తేదీన బిలాస్‌పూర్‌లో రాత్రి 09:10 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 09:45 గంటలకు పోడనూర్ చేరుకుంటుంది. ఈ రైలు రాయ్‌పూర్, దుర్గ్, గోందియా, బల్హర్షా, వరంగల్, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్టై, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

దుర్గ్-ఎర్నాకులం(ట్రైన్ నెం. 08707)

దుర్గ్-ఎర్నాకులం ట్రైన్ 30.05.2026న ఉంది. దుర్గ్‌లో అర్ధరాత్రి 00:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 02:00 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. గోందియా, బల్హర్షా, వరంగల్, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలూవా స్టేషన్లలో ఈ రైలుకు స్టాపింగ్స్ ఉన్నాయి.

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జల్నా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

  • రైలు నంబర్ 07814 (జల్నా - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు జూన్ 4, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు ప్రతి వారం గురువారం నాడు జల్నా స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 07815 (తిరుపతి - జల్నా): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 5, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు ప్రతి వారం శుక్రవారం నాడు తిరుపతి నుండి జల్నాకు ప్రయాణికులను చేరవేస్తుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

  • ఆంధ్రప్రదేశ్: విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
  • తెలంగాణ: బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.
  • మహారాష్ట్ర: పార్తూర్, సెలూ, పర్భణి, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks