Summer Special Trains : వేసవి వేళ ప్రయాణికుల రద్దీ - ఏపీ, తెలంగాణ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు..! రూట్లు ఇవే

SCR Summer Special Trains 2026 : వేసవి సెలవుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ, చర్లపల్లి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. 

Published on: Apr 19, 2026, 16:07:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. అయితే రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. అయితే తాజాగా ఏపీ, తెలంగాణ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

ఈ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు…

ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్లు నడుస్తుండగా… తాజాగా చర్లపల్లి – సంత్రాగచ్చి. హైదరాబాద్ - సంత్రాగచ్చి, కాకినాడ టౌన్ – హిసార్ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 21 నుంచి పట్టాలెక్కనున్నాయి.

  • చర్లపల్లి – సంత్రాగచ్చి(07677) :ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఏప్రిల్ 21 (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 14.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.
  • సంత్రాగచ్చి - హైదరాబాద్ (07678) : ఈ రైలు ఏప్రిల్ 22 (బుధవారం) సాయంత్రం 16.45 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి…. గురువారం రాత్రి 23.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ మరియు ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

కాకినాడ టౌన్ – హిసార్ – కాకినాడ టౌన్ స్పెషల్ (07717/07718) : ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైలు సేవలు అందించనుంది.

  • కాకినాడ - హిసార్( రైలు నంబర్ 07717): ఏప్రిల్ 21 (మంగళవారం) తెల్లవారుజామున 05.40 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి…. గురువారం మధ్యాహ్నం 13.40 గంటలకు హిసార్ చేరుకుంటుంది.
  • హిసార్ - కాకినాడ టౌన్ (రైలు నంబర్ 07718): ఏప్రిల్ 24 (శుక్రవారం) మధ్యాహ్నం 14.10 గంటలకు హిసార్‌లో బయలుదేరి… ఆదివారం రాత్రి 21.35 గంటలకు తిరిగి కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు…. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్ తో పాటు పలు స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో 1ఏసీ కోచ్‌తో పాటు 2AC, 3AC, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More