...
...
Next Story

SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - గుత్తి, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు, తేదీలివిగో

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. యశ్వంతపూర్ - కటిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ ఏపీలోని గుత్తి, విజయవాడ రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: Mar 7, 2026, 20:15:54 IST
Advertisement

ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ ఇఛ్చింది. యశ్వంత్‌పూర్ – కటిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్ ఏపీలోని గుత్తి, విజయవాడతో పాటు పలు రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

ప్రత్యేక రైళ్లు - జర్నీ తేదీలు

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం… యశ్వంతపూర్ - కటిహార్ (రైలు నం. 06571) మార్చి 10 నుంచి మార్చి 31వ తేదీ వరకు 4 ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కటిహార్ - యశ్వంతపూర్ ( రైలు నం. 06572) మధ్య మార్చి 13 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ రూట్ లో 4 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తేదీల్లో ప్రయాణికులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఆగే స్టేషన్లు ఇవే…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks