వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులు కాలానుగుణ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు, వేడి గాలులు పశువులపై ప్రభావం చూపుతాయని నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సలహాలను జాగ్రత్తగా పాటించడం వల్ల పశువులు బాగుంటాయని, రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు
- క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో మమేకం కావాలి. రైతులు ఉత్తమ పద్ధతులు పాటించేలా చూడాలి. పశువులకు రైతులు రోజంతా శుభ్రమైన నీటిని అందించాలి. సామూహిక నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి.
- పశువుల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి సహాయపడటానికి, పశుగ్రాసాన్ని చల్లని వేళల్లో ముక్కలుగా చేసి, 30-50 గ్రాముల ఖనిజ పోషక పదార్ధాలతో కలిపి అందించాలి.
- అలాగే జంతువులను ఉదయం, సాయంత్రం మాత్రమే మేపాలి. వాటిని చల్లని, గాలి ప్రసరణ ఉండే షెడ్లలో ఉంచాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ సూచించారు.
- పొద్దున్నే పాలు పిండటం వల్ల ఒత్తిడి తగ్గి, దిగుబడి మెరుగుపడుతుంది. షెడ్లు తూర్పు-పడమర దిశలో ఉండాలని, వాటి పైకప్పులపై నీళ్లు చల్లే సౌకర్యం ఉండాలని, అలాగే సంకర జాతి పశువులకు ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ అన్నారు.
- వేడి ఒత్తిడి లక్షణాలలో వేగంగా శ్వాస తీసుకోవడం, లాలాజలం కారడం, ఆకలి మందగించడం వంటివి ఉంటాయి. అప్పుడు రైతులు వెంటనే పశువులను చల్లబరచాలి, పశువైద్యులను సంప్రదించాలి. పశువుల రవాణాను చల్లని సమయాల్లో మాత్రమే పరిమితం చేయాలి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి మేత పెట్టాలి.
- పశువులకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలి. వీలైతే పక్షులకు కూడా నీరు అందించేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయండి.
- వేసవి కాలంలో అవగాహన కార్యక్రమాలు, క్రమం తప్పకుండా పర్యటనలు చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ పశువైద్య సేవలను ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. అలాగే చల్లదనాన్ని కలిగించేందుకు షెడ్ల చుట్టూ తడి గోనె సంచులను కట్టాలి.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}