విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ధర్నా.. ఇన్‌క్రిమెంట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్
తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగులు చేరుకుని నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు, హెచ్చరికలను అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వివిధ శాఖల పరిధిలో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు రావలసిన హక్కుల కోసం ఈ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం రావాల్సిన రెండు నోషనల్ ఇన్‌క్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు స్పష్టమైన, శాశ్వత ప్రమోషన్ ఛానెల్‌ను ఖరారు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలతోపాటు అలవెన్సులను వెంటనే జమ చేయాలని, అదనపు సర్వేలు, ఒత్తిళ్లను తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘాల నాయకులు చలో విజయవాడ కార్యక్రమం గురించి ముందే ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం వారితో చర్చలు జరపడానికి నిరాకరించిందని ఆందోళనకారులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించేందుకు బదులు, పోలీసు బలగాలను ఉపయోగించి నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఉద్యోగులు విమర్శించారు.
పోలీసులు నగరంలో ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా, విధులకు హాజరయ్యే అనేక మంది సచివాలయ నాయకులు, ఉద్యోగులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బిఆర్టిఎస్ రోడ్డు, లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించి తనిఖీలు చేపట్టారు.
'రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ, ప్రతి నెలా సామాజిక పింఛన్ల పంపిణీ, రకరకాల ప్రభుత్వ సర్వేలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం విరివిగా వాడుకుంటోంది. కానీ న్యాయమైన సమస్యలు, వేతన బకాయిలు తీర్చే విషయానికి వచ్చేసరికి మాత్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది.' అని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది ఉద్యోగులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రజాస్వామ్యయుతంగా తమ డిమాండ్లను విన్నవించుకోవడానికి వచ్చిన ఉద్యోగులపై బలప్రయోగం చేయడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని సంఘ నాయకులు స్పష్టం చేశారు.
స్పందించిన మంత్రి
విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని చెప్పారు. సచివాలయ సిబ్బంది రెగ్యులరైజేషన్, సౌకర్యాల విషయంలో రాజీ పడట్లేదన్నారు. పాత బకాయిలు, ప్రమోషన్స్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టుగా చెప్పారు. గతంలో ఇవ్వాల్సిన రెగ్యులరైజేషన్‌ను తమ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ఆర్థిక శాఖకు పంపినట్టుగా వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


