ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
రానున్న తుపాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతోపాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఆక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అప్రమత్తం
అక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంభవించిన తుపాన్ల సమయంలో ఎదురైన పరిస్థితులు, విద్యుత్ పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేలకూలినా, తీగలు తెగిపడినా వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు మంత్రి గొట్టిపాటి. ఇందుకోసం అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని, తుపాను సమయంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేలకూలినా, తీగలు తెగిపడినా వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు మంత్రి గొట్టిపాటి. ఇందుకోసం అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని, తుపాను సమయంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}ముఖ్యంగా తెగిపడిన విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు ఉంటే వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. సరఫరా నిలిచిన ప్రాంతాలు, పునరుద్ధరణకు పట్టే సమయం తదితర వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు.