రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు

SIPB : రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. దీనితో లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో రానున్నాయి.

Updated on: Apr 7, 2026, 17:53:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చ జరిగింది.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎస్ఐపీబీ సమావేశంలో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పచ్చజెండా ఊపింది. సమావేశంలో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని చంద్రబాబు తెలిపారు.

బోర్డు సమావేశంలో సాగు వ్యర్థాల సద్వినియోగం చేయడానికి యూనిట్ల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాయలసీమను సౌరవిద్యుత్ ఉత్పత్తికేంద్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడులను ఆకర్శించాలని చెప్పారు.

రాయలసీమ ప్రాంతాన్ని ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పటిష్టమైన ట్రాన్స్‌మిషన్ మౌలిక సదుపాయాలను ప్రణాళిక చేసి, అభివృద్ధి చేయాలని చెప్పారు.

'శ్రీ సిటీ, కొప్పర్తి, అనంతపురం వంటి ప్రాంతాలపై దృష్టి సారించాలి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రాన్ని ఒక కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలి. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను(జీసీసీ) ఏర్పాటు చేయడం, ఐటీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి.' అని చంద్రబాబు అన్నారు.

ఫార్మా, ఉక్కు, హరిత ఇంధనం, బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల వంటి రంగాలన్నింటిలో ఆధునిక భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విపత్తు నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఒక ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించబడుతుందన్నారు. ఆమోదించిన ప్రాజెక్టులను నిర్దేశిత కాలపరిమితిలోగా త్వరితగతిన ప్రారంభించాలని, పెట్టుబడిదారుల సదస్సులలో కుదిరిన అవగాహన ఒప్పందాలను(MoUs) చురుకుగా అమలు చేయాలన్నారు.

ఆహార శుద్ధి, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి పెరుగుతున్న ఉద్యానవన ఉత్పత్తికి అనుగుణంగా ఆహార శుద్ధి సామర్థ్యాన్ని విస్తరించాలని, అలాగే పామాయిల్, కోకో వంటి పంటలకు మెరుగైన మార్కెటింగ్ మద్దతును అందించాలని ఎస్ఐపీబీ నిర్ణయించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More