భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు- పూర్తి వివరాలు ఇవి..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేసింది. మొత్తం 119 ఖాళీల కోసం అర్హత గల అభ్యర్థులు జనవరి 9, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్).. నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఘజియాబాద్ యూనిట్‌లో ట్రైనీ ఇంజనీర్-I, ట్రైనీ ఆఫీసర్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ జనవరి 9.
బీఈఎల్ రిక్రూట్‌మెంట్- విభాగాల వారీగా ఖాళీలు..
బీఈఎల్ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 119 పోస్టులను వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
ఎలక్ట్రానిక్స్: 65 పోస్టులు (జనరల్-30, ఓబీసీ-20, ఈడబ్ల్యూఎస్-4, ఎస్సీ-7, ఎస్టీ-4)
మెకానికల్: 37 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-10, ఈడబ్ల్యూఎస్-3, ఎస్సీ-6, ఎస్టీ-3)
ఎలక్ట్రికల్: 8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఈడబ్ల్యూఎస్-1, ఎస్సీ-1)
కంప్యూటర్ సైన్స్: 6 పోస్టులు (ఈడబ్ల్యూఎస్-3, ఎస్టీ-3)
కెమికల్: 1 పోస్టు (జనరల్-1)
ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): 2 పోస్టులు (ఎస్సీ-1, ఈడబ్ల్యూఎస్-1)
బీఈఎల్ రిక్రూట్‌మెంట్- అర్హత ప్రమాణాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: జనవరి 1, 2026 నాటికి.. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
- బ్యాంక్ ఉద్యోగాల అలర్ట్- ఎస్బీఐ రిక్రూట్మెంట్లో వేకెన్సీ సంఖ్య పెంపు- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బీఈఎల్ రిక్రూట్‌మెంట్- దరఖాస్తు రుసుము..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజుగా రూ. 150 నిర్ణయించారు. దీనికి అదనంగా 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజును కేవలం ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు బీఈఎల్ ట్రైనీ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫామ్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీనే ఫీజు చెల్లించేటప్పుడు కూడా ఉపయోగించాలని అధికారులు సూచించారు.
బీఈఎల్ రిక్రూట్‌మెంట్- ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. ఈ పరీక్ష ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. దరఖాస్తులో అభ్యర్థులు సమర్పించిన సమాచారం ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
బీఈఎల్ ట్రైనీ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


