ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకున్న అనుబంధం రాజీవ్ గాంధీ భార్యగానో లేదా కేవలం సోనియా గాంధీగానో కాకుండా, మాజీ ప్రధాని ఇందిరమ్మ కోడలిగా మాత్రమే బలపడిందని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) అనే ఆత్మకథలో తెలుగు రాష్ట్రాలతో తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని, 2004 నాటి ఎన్నికల ప్రచార అనుభవాలను, నాటి రాజకీయ పరిణామాలను గుర్తుచేసుకున్నారు.

2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలో జన సంపర్క్ యాత్ర పూర్తి చేసుకుని తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టానని సోనియా గాంధీ తన పుస్తకంలో వివరించారు. రాష్ట్రంలో తన తొలి జ్ఞాపకం హైదరాబాద్ అని, అక్కడ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ను సందర్శించానని తెలిపారు. 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ శంకుస్థాపన చేసి, నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఈ చారిత్రక భవనాన్ని ఆమె ఒక అద్భుతమైన పురాతన కట్టడంగా అభివర్ణించారు.
అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సాగిన తన యాత్రలో అడుగడుగునా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా గాంధీకి జైకొడుతూ ఘనస్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలు దివంగత ఇందిరా గాంధీని ఎంతో ఆప్యాయంగా ఇందిరమ్మ అని పిలుచుకునేవారని ఆమె రాసుకొచ్చారు.
విజయవాడ పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న బంజారామహిళలతో జరిగిన ఒక సమావేశం తన హృదయాన్ని హత్తుకుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. తమ వాహనాలు నెమ్మదిగా వెళ్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలను చూసి తాను కాన్వాయ్ ఆపి వారిని కలిశానని తెలిపారు. ఎరుపు, నీలం రంగుల లెహంగాలు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు, అద్దాలు పొదిగిన ఓణీలతో ఉన్న వారి వస్త్రధారణ తనకు ఎంతో వ్యక్తిగత ఆసక్తిని కలిగించిందన్నారు. తన వివాహానికి ముందు రోజు జరిగిన మెహందీ వేడుకలో తాను కూడా సరిగ్గా అలాంటి దుస్తులనే ధరించానని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ మహిళలు ఎంతో ప్రేమతో ఒక ఓణీని తన తలపై కప్పారని, ఆ దుస్తుల వెనుక ఉన్న తన పెళ్లి నాటి జ్ఞాపకాన్ని ఒక అనువాదకురాలి సాయంతో వారికి వివరించానని సోనియా తెలిపారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆనందపడిన ఆ మహిళలు అక్కడికక్కడే నృత్యం చేస్తూ, తనను కూడా వారితో పాటు కలుపుకొన్నారని రాశారు.
{{/usCountry}}ఆ మహిళలు ఎంతో ప్రేమతో ఒక ఓణీని తన తలపై కప్పారని, ఆ దుస్తుల వెనుక ఉన్న తన పెళ్లి నాటి జ్ఞాపకాన్ని ఒక అనువాదకురాలి సాయంతో వారికి వివరించానని సోనియా తెలిపారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆనందపడిన ఆ మహిళలు అక్కడికక్కడే నృత్యం చేస్తూ, తనను కూడా వారితో పాటు కలుపుకొన్నారని రాశారు.
{{/usCountry}}"నువ్వు మా ఇందిరమ్మ కోడలివి.. మా ఓటు నీకే, కాంగ్రెస్ పార్టీకే" అంటూ ఆ మహిళలు, చుట్టుపక్కల ప్రజలు నినాదాలు చేశారని సోనియా గాంధీ తెలిపారు. యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రజలందరిలో ఒక స్పష్టమైన మార్పు కనిపించిందని, ఆ ప్రజా స్పందనే తన రాజకీయ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
తన ఆత్మకథలో 1969, 1975 నాటి కీలక రాజకీయ ఘట్టాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతల పాత్రను కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. 1969 మే నెలలో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణానంతరం, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల కూటమి (సిండికేట్) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటికే ఇందిరా గాంధీకి సంజీవరెడ్డి తీవ్ర వ్యతిరేకిగా ఉండేవారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపరాష్ట్రపతి వి.వి. గిరికి మద్దతు ఇచ్చి, 'అంతరాత్మ ప్రబోధం' మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో వి.వి. గిరి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీపై ఇందిరా గాంధీ పట్టు సాధించడంలో ఒక మైలురాయిగా నిలిచిందని సోనియా గాంధీ తన ఆత్మకథలో విశ్లేషించారు.
జూన్ 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఇందిరా గాంధీని పదవి నుంచి దించేందుకు మద్దతు కోరుతూ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నాడు నీలం సంజీవరెడ్డికి పంపిన సందేశాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (జలగం వెంగళరావు అడ్డుకున్నారని సోనియా రాశారు.