తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు..!

పండగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్ - పార్వతీపురం వన్-వే స్పెషల్ సర్వీసులతో పాటు జాల్నా-ఛప్రా రైళ్ళ పొడిగించారు.

Published on: Oct 25, 2026, 05:12:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వన్-వే స్పెషల్ రైళ్ళను నడపడంతో పాటు, ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ళ సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

రైలు నెంబర్ 07077 (చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్) :

ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 25 ఆదివారం ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10:35 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది.

ఈ రైలు కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, జుఝార్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, మాణిక్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

రైలు నెంబర్ 07078 (హైదరాబాద్ - పార్వతీపురం) :

ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 27 మంగళవారం మధ్యాహ్నం 15:30 (3:30) గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మరుసటి రోజు (బుధవారం) ఉదయం 07:00 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.

మార్గమధ్యంలో ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

పొడిగించిన ప్రత్యేక రైళ్ళ వివరాలు :

రైలు నెంబర్ 07651 (జాల్నా - ఛప్రా): బుధవారం నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నవంబర్ 11, నవంబర్ 18, నవంబర్ 25 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగించారు.

రైలు నెంబర్ 07652 (ఛప్రా - జాల్నా): శుక్రవారం నడిచే ఈ రైలు సర్వీసులను నవంబర్ 13, నవంబర్ 20, నవంబర్ 27 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పండగ ప్రయాణాలు చేసేవారు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More