SCR Train Diversions : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ - పలు రైళ్లు దారి మళ్లింపు..! ఈ స్టేషన్లలో హాల్టింగ్ రద్దు
SCR Train Diversion Updates : విజయవాడ డివిజన్ రాయనపాడు యార్డులో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా మే 1 నుంచి 5 వరకు పలు కీలక రైళ్లను దారి మళ్లించనున్నారు. వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్స్ రద్దు చేశారు.
South Central Railway Train Diversion Updates : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.విజయవాడ డివిజన్ రాయనపాడు యార్డులో జరుగుతున్న ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించనుంది. మే 1వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పలు ప్రధాన రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించనున్నట్లు ప్రకటించింది. ఈ పనుల కారణంగా… విజయవాడ - దువ్వాడ సెక్షన్ లో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడనుంది.

రాయనపాడు వద్ద జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా విశాఖపట్నం, ముంబై, షిరిడీ వంటి నగరాలకు వెళ్లే కీలక రైళ్లను దారి మళ్లిస్తారు. ముఖ్యంగా విజయవాడ - కాజీపేట - పగిడిపల్లి మీదుగా వెళ్లాల్సిన రైళ్లను విజయవాడ - కృష్ణ కెనాల్ - గుంటూరు - పగిడిపల్లి మీదుగా నడపనున్నారు.
పలు రైళ్ల దారి మళ్లింపు - వివరాలు:
- విశాఖపట్నం - ఎల్‌టీటీ ముంబై (ట్రైన్ నెంబర్ 18519) రైలును కాజీపేట మీదు నుంచి కాకుండా…విజయవాడ - కృష్ణా కెనాల్ - గుంటూరు - పగిడిపల్లి మీదుగా నడపనున్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
- ఎల్‌టీటీ ముంబై - విశాఖపట్నం (18520): రైలును పగిడిపడ్డి - గుంటూరు- కృష్ణా కెనాల్ - విజయవాడ మీదుగా మళ్లిస్తారు. కాజీపేటలో హాల్ట్ ఉండదు.
- సిఎస్‌టి ముంబై - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019)ను మే 1 నుంచి 4వ తేదీ వరకు దారి మళిస్తారు. ఈ నిర్ణయం ప్రకారం… కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టేషన్లలో హాల్ట్ ఉండదు.
- మచిలీపట్నం - సాయి నగర్ షిరిడీ (17208) మే 5వ తేదీన విజయవాడ - కృష్ణా కెనాల్ - గుంటూరు - పగిడిపల్లి మీదుగా దారి మళ్లిస్తారు. పలు స్టేషన్లలో హాల్ట్ ఉండదు.
దారి మళ్లింపు కారణంగా ఈ రైళ్లు సాధారణ మార్గంలో ఉండే కొన్ని ప్రధాన స్టేషన్లలో ఆగకుండా వెళ్తాయి. వీటిలో ప్రధానంగా కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, డోర్నకల్ వంటి స్టేషన్లున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించుకోవాలని… అందుకు అనుగుణంగా ప్రయాణాలు ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
రద్దు చేసిన రైళ్ల వివరాల లిస్ట్ :
రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటన కూడా చేసింది. పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో శాతవాహన, గోల్కొండ, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటివి కూడా ఉన్నాయి.
- విజయవాడ - భద్రాచలం రోడ్ - విజయవాడ(67215 / 67216) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను 28.04.26 నుండి 05.05.26 వరకు రద్దు చేశారు.
- విజయవాడ - డోర్నకల్ - విజయవాడ(67768 / 67767) మధ్య ప్రతిరోజు నడిచే రైళ్లు కూడా రద్దు అయ్యాయి. ఏప్రిల్ 28 నుంచి 05.05.26 వరకు రాకపోకలు ఉండవు.
- విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ (శాతవాహన -12713 / 12714) రైళ్లు మే 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రద్దవుతాయి.
- గుంటూరు - సికింద్రాబాద్ - విజయవాడ (గోల్కొండ - 17201 / 17202) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు మే 2 నుంచి 5వ తేదీ వరకు క్యాన్సిల్ అవుతాయి.
- గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు(12705 / 12706) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దవుతాయి.
- విశాఖపట్నం - మహబూబ్‌నగర్ - విశాఖపట్నం(12861 / 12862) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 1 నుంచి మే 5 వరకు రద్దు చేశారు.
- కాకినాడ పోర్ట్ - లింగంపల్లి - కాకినాడ పోర్ట్ (గౌతమి -12737 / 12738) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 1 నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు.
- కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ (12775 / 12776) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 3, 4 తేదీల్లో రద్దవుతాయి.
- సంబల్‌పూర్ - హెచ్.ఎస్. నాందేడ్ - సంబల్‌పూర్(20809 / 20810)మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 1,2 3, 4,5 తేదీల్లో రద్దవుతాయి.
- విశాఖపట్నం - హెచ్.ఎస్. నాందేడ్ - విశాఖపట్నం(20811 / 20812) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 2 3 తేదీల్లో రద్దవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

