Secunderabad Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకు మే 18వ తేదీని ఖరారు చేసింది.
- సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రతీ ఆదివారం నడిచేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 17043) ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది.
- సికింద్రాబాద్ లో ఆదివారం రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ రైలు…. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.
- అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రతీ సోమవారం నడిచేలా మరో కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17044) మే 18 నుంచి అందుబాటులోకి వస్తోంది.
- అనకాపల్లిలో సోమవారం సాయంత్రం 5.35కు బయలుదేరే ఈ ఎక్స్ ప్రెస్ రైలు…. మంగళవారం ఉదయం 8.40కి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రెండు దిశల్లోనూ వారానికి ఒకసారి నడుస్తుంది.
హాల్టింగ్ లిస్ట్….
{{^htLoading}} {{/htLoading}}
ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లోని కీలక పట్టణాలను కలుపుతూ సాగుతుంది. నల్గొండ, గుంటూరు, విజయవాడతో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు గొప్ప వెసులుబాటు కలుగుతుంది.
- చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు. భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
- ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలులో అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, 12 ధర్డ్ ఏసీ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
- వారం ప్రారంభంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నడిచేలా ఈ రైళ్ల షెడ్యూల్ ప్లాన్ చేశారు.
- తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా హాల్టింగ్ లు ఇచ్చారు. ఫలితంగా అనకాపల్లితో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు ఈ రైళ్లు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}