...
...
Next Story

Vijayawada-Lingampalli Intercity Express : విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్లలో స్టాప్

Vijayawada Lingampalli Intercity Express : విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్లలో ప్రయోగాత్మక స్టాపేజ్‌ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. దీంతో పిడుగురాళ్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: Aug 30, 2026, 11:04:49 IST
Advertisement

విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం పాటు ఆగేందుకు అనుమతి ఇచ్చింది.

దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

ఈ నూతన స్టాపేజ్ 2026 సెప్టెంబర్ 4వ తేదీ నుండి అమలులోకి రానుంది. ప్రాథమికంగా ఆరు నెలల కాలపరిమితికి గానూ ఈ ప్రయోగాత్మక స్టాపేజ్‌ను కేటాయించారు. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా దీనిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

రైలు నంబర్ 12795 (విజయవాడ – లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) విజయవాడ నుంచి సాయంత్రం 05:30 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లకు రాత్రి 07:08కు వచ్చి 07:09 గంటలకు బయలుదేరుతుంది. మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో ఆగుతుంది.

రైలు నంబర్ 12796 లింగంపల్లి నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లకు ఉదయం 08:06లకు వస్తుంది. 08:07కు బయలుదేరుతుంది. పిడుగురాళ్ల ప్రాంత ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రయాణికుల స్పందన ఆధారంగా ఈ స్టాపేజ్ పెంపుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గుంటూరు-వికారాబాద్ ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ రద్దీని నియంత్రించేందుకు గుంటూరు-వికారాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

రైలు నంబరు 07227 (గుంటూరు – వికారాబాద్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30న (ఆదివారం) రాత్రి 9:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 31, సోమవారం) ఉదయం 5:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు కీలకమైన స్టేషన్లలో ఆగుతాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లిలో స్టాప్‌లు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe