ప్రయాణికులకు అలర్ట్ - తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు! హాల్ట్ లిస్ట్ ఇదే
SCR Festival Special Trains 2026 : పండుగ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, అనంతపురం మీదుగా ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగిస్తాయి.
SCR Festival Special Trains 2026 : పండగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పోదనూర్ - బరౌని, ఎస్ఎంవీటీ బెంగళూరు - దానాపూర్, న్యూఢిల్లీ - బెంగళూరు కంటోన్మెంట్ మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఊరట లభించనుంది.

రూట్ల వారీగా వివరాలు…
- రైలు నంబర్ 06139 (పోదనూర్ - బరౌని స్పెషల్) : ఈ రైలు నవంబర్ 18, 2026 (బుధవారం) ఉదయం 06:15 గంటలకు పోదనూర్లో బయల్దేరింది. శుక్రవారం మధ్యాహ్నం 13:30 గంటలకు బరౌని చేరుకుంటుంది. ఈ రైలు… ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్నగర్ తో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో కేవలం సెకండ్ క్లాస్ చైర్ కార్ కోచ్లు మాత్రమే ఉంటాయి.
- రైలు నంబర్ 06530 (ఎస్ఎంవీటీ బెంగళూరు - దానాపూర్ స్పెషల్): ఈ రైలు నవంబర్ 20, 2026 (శుక్రవారం) రాత్రి 23:35 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 04:00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, కృష్ణ, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా వెళ్తుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి.
- రైలు నంబర్ 04006 (న్యూఢిల్లీ - బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్) : ఈ రైలు నవంబర్ 18, 2026 (బుధవారం) మధ్యాహ్నం 13:20 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 09:50 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది.
రైలు నంబర్ 04005 (బెంగళూరు కంటోన్మెంట్ - న్యూఢిల్లీ స్పెషల్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 24, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 15:45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా వెళ్తుంది.
ఈ రైళ్లలో సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, హాల్ట్ స్టేషన్లు, కోచ్ల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

