ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తూత్తుకూడి (టుటికోరిన్ ), ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

రైలు నంబర్ 06018 (తూత్తుకూడి – నరసాపురం వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం రాత్రి 23:30 గంటలకు తూత్తుకూడిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం అర్ధరాత్రి దాటాక) 00:20 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
రైలు నంబర్ 06017 (నరసాపురం – తూత్తుకూడి వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 9, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 04:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి, మరుసటి రోజు (గురువారం) ఉదయం 04:30 గంటలకు తూత్తుకూడి చేరుకుంటుంది.
తూత్తుకూడి నుంచి నరసాపురం - ఏ స్టేషన్ కు ఎప్పుడు..?
- తూత్తుకూడి: బయలుదేరే సమయం రాత్రి 23:30 (సోమవారం)
- మదురై: రాక 02:00 / నిష్క్రమణ 02:05
- తిరుచిరాపల్లి: రాక 05:20 / నిష్క్రమణ 05:30
- చెన్నై ఎగ్మోర్: రాక 13:00 / నిష్క్రమణ 13:15
- నెల్లూరు: రాక 16:43 / నిష్క్రమణ 16:45
- ఒంగోలు: రాక 18:43 / నిష్క్రమణ 18:45
- చీరాల: రాక 19:28 / నిష్క్రమణ 19:30
- బాపట్ల: రాక 19:43 / నిష్క్రమణ 19:45
- తెనాలి: రాక 20:13 / నిష్క్రమణ 20:15
- విజయవాడ: రాక 20:50 / నిష్క్రమణ 21:00
- గుడివాడ: రాక 21:48 / నిష్క్రమణ 21:50
- కైకలూరు: రాక 22:18 / నిష్క్రమణ 22:20
- ఆకివీడు: రాక 22:33 / నిష్క్రమణ 22:35
- భీమవరం టౌన్: రాక 23:03 / నిష్క్రమణ 23:05
- నరసాపురం: చేరే సమయం 00:20 (మంగళవారం అర్ధరాత్రి)
నరసాపురం నుండి తూత్తుకూడి - ఏ స్టేషన్ కు ఎప్పుడు..?
- నరసాపురం: బయలుదేరే సమయం ఉదయం 04:00 (బుధవారం)
- భీమవరం టౌన్: రాక 04:33 / నిష్క్రమణ 04:35
- ఆకివీడు: రాక 04:50 / నిష్క్రమణ 04:52
- కైకలూరు: రాక 05:08 / నిష్క్రమణ 05:10
- గుడివాడ: రాక 05:38 / నిష్క్రమణ 05:40
- విజయవాడ: రాక 06:50 / నిష్క్రమణ 07:00
- తెనాలి: రాక 07:28 / నిష్క్రమణ 07:30
- బాపట్ల: రాక 07:53 / నిష్క్రమణ 07:55
- చీరాల: రాక 08:08 / నిష్క్రమణ 08:10
- ఒంగోలు: రాక 08:53 / నిష్క్రమణ 08:55
- నెల్లూరు: రాక 10:53 / నిష్క్రమణ 10:55
- చెన్నై ఎగ్మోర్: రాక 15:00 / నిష్క్రమణ 15:15
- తిరుచిరాపల్లి: రాక 22:40 / నిష్క్రమణ 22:50
- మదురై: రాక 01:20 / నిష్క్రమణ 01:25 (గురువారం)
- తూత్తుకూడి(టుటికోరిన్): చేరే సమయం ఉదయం 04:30 (గురువారం)
ఈ ప్రత్యేక రైలులో 01ఏసీ టూ టైర్, 02- ఏసీ త్రీ టైర్, 08-స్లీపర్ క్లాస్, 04-జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు మధ్య ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైలులో 01ఏసీ టూ టైర్, 02- ఏసీ త్రీ టైర్, 08-స్లీపర్ క్లాస్, 04-జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు మధ్య ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
{{/usCountry}}