ప్రయాణికులకు శుభవార్త - నరసాపురం- తమిళనాడు మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్, షెడ్యూల్ ఇలా

పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో నరసాపురం-తూత్తుకూడి మధ్య వారపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Published on: Aug 26, 2026, 10:34:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తూత్తుకూడి (టుటికోరిన్ ), ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

నరసాపురం- తమిళనాడు మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. వివరాలు
నరసాపురం- తమిళనాడు మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. వివరాలు

రైలు నంబర్ 06018 (తూత్తుకూడి – నరసాపురం వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం రాత్రి 23:30 గంటలకు తూత్తుకూడిలో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం అర్ధరాత్రి దాటాక) 00:20 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

రైలు నంబర్ 06017 (నరసాపురం – తూత్తుకూడి వారపు ప్రత్యేక రైలు) : ఈ రైలు సెప్టెంబర్ 9, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 04:00 గంటలకు నరసాపురంలో బయలుదేరి, మరుసటి రోజు (గురువారం) ఉదయం 04:30 గంటలకు తూత్తుకూడి చేరుకుంటుంది.

తూత్తుకూడి నుంచి నరసాపురం - ఏ స్టేషన్ కు ఎప్పుడు..?

  • తూత్తుకూడి: బయలుదేరే సమయం రాత్రి 23:30 (సోమవారం)
  • మదురై: రాక 02:00 / నిష్క్రమణ 02:05
  • తిరుచిరాపల్లి: రాక 05:20 / నిష్క్రమణ 05:30
  • చెన్నై ఎగ్మోర్: రాక 13:00 / నిష్క్రమణ 13:15
  • నెల్లూరు: రాక 16:43 / నిష్క్రమణ 16:45
  • ఒంగోలు: రాక 18:43 / నిష్క్రమణ 18:45
  • చీరాల: రాక 19:28 / నిష్క్రమణ 19:30
  • బాపట్ల: రాక 19:43 / నిష్క్రమణ 19:45
  • తెనాలి: రాక 20:13 / నిష్క్రమణ 20:15
  • విజయవాడ: రాక 20:50 / నిష్క్రమణ 21:00
  • గుడివాడ: రాక 21:48 / నిష్క్రమణ 21:50
  • కైకలూరు: రాక 22:18 / నిష్క్రమణ 22:20
  • ఆకివీడు: రాక 22:33 / నిష్క్రమణ 22:35
  • భీమవరం టౌన్: రాక 23:03 / నిష్క్రమణ 23:05
  • నరసాపురం: చేరే సమయం 00:20 (మంగళవారం అర్ధరాత్రి)

నరసాపురం నుండి తూత్తుకూడి - ఏ స్టేషన్ కు ఎప్పుడు..?

  • నరసాపురం: బయలుదేరే సమయం ఉదయం 04:00 (బుధవారం)
  • భీమవరం టౌన్: రాక 04:33 / నిష్క్రమణ 04:35
  • ఆకివీడు: రాక 04:50 / నిష్క్రమణ 04:52
  • కైకలూరు: రాక 05:08 / నిష్క్రమణ 05:10
  • గుడివాడ: రాక 05:38 / నిష్క్రమణ 05:40
  • విజయవాడ: రాక 06:50 / నిష్క్రమణ 07:00
  • తెనాలి: రాక 07:28 / నిష్క్రమణ 07:30
  • బాపట్ల: రాక 07:53 / నిష్క్రమణ 07:55
  • చీరాల: రాక 08:08 / నిష్క్రమణ 08:10
  • ఒంగోలు: రాక 08:53 / నిష్క్రమణ 08:55
  • నెల్లూరు: రాక 10:53 / నిష్క్రమణ 10:55
  • చెన్నై ఎగ్మోర్: రాక 15:00 / నిష్క్రమణ 15:15
  • తిరుచిరాపల్లి: రాక 22:40 / నిష్క్రమణ 22:50
  • మదురై: రాక 01:20 / నిష్క్రమణ 01:25 (గురువారం)
  • తూత్తుకూడి(టుటికోరిన్): చేరే సమయం ఉదయం 04:30 (గురువారం)

ఈ ప్రత్యేక రైలులో 01ఏసీ టూ టైర్, 02- ఏసీ త్రీ టైర్, 08-స్లీపర్ క్లాస్, 04-జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు మధ్య ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More