...
...
Next Story

కాకినాడ టు మహారాష్ట్ర... రైలులో కలప గుజ్జు రవాణా, దేశంలోనే తొలిసారి!

South Coast Railway Wood Pulp Transport : కాకినాడ నుంచి మహారాష్ట్రకు చెక్క గుజ్జును తొలిసారిగా రైల్వే ద్వారా రవాణా చేయడం ప్రారంభమైంది. దీనివల్ల భారతీయ రైల్వేలకు ఏటా రూ.20 కోట్ల దాకా అదనపు వర్తక ఆదాయం సమకూరనుంది.

Published on: Sep 20, 2026, 12:03:31 IST
Advertisement

South Coast Railway Wood Pulp Transport : సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటివరకు రహదారి మార్గం (రోడ్డు మార్గం) ద్వారా సాగిన సరుకు రవాణాను తన వైపునకు తిప్పుకోవడంలో దక్షిణ కోస్తా రైల్వే సఫలీకృతమైంది.

రైలులో కలప గుజ్జు రవాణా
రైలులో కలప గుజ్జు రవాణా

విదేశాల నుంచి దిగుమతి అయ్యే చెక్క గుజ్జు (ఇంపార్టెడ్ వుడ్ పల్ప్) రవాణాను ఇకపై రోడ్డు మార్గానికి బదులుగా సంపూర్ణంగా రైలు మార్గానికి మళ్లించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు మొదటి 'బాస్ట్ రైక్' (BOST Rake) ద్వారా పల్ప్ సరుకును విజయవంతంగా లోడ్ చేసి పంపించారు.

దక్షిణ కోస్తా రైల్వే విజ్ఞప్తి మేరకు…. జూలై 2026లో రైల్వే బోర్డు సరుకుల టారిఫ్ విధానంలో కీలక సవరణలు చేసింది. వుడ్ పల్ప్‌ను 'గూడ్స్ టారిఫ్ క్లాస్-110' (Goods Tariff Class-110) కింద చేర్చారు. ఈ టారిఫ్ సవరణల వల్ల రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు మార్గం ద్వారా సరుకు పంపడం వ్యాపారులకు ఎంతో ఆర్థికంగా, చౌకగా మారింది.

ప్రయోజనాలు:

• కాకినాడ (విజయవాడ డివిజన్ / దక్షిణ తీర రైల్వే) నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్ వరకు మొత్తం 1,061 కిలోమీటర్ల మేర ఈ సరుకు ప్రయాణిస్తుంది.

• ఒక్కో బాస్ట్ రైక్ ద్వారా రైల్వేకు సుమారు రూ. 40 లక్షల వరకు రవాణా ఛార్జీల (ఫ్రైట్) ఆదాయం సమకూరనుంది.

• కేవలం ఈ ఒక్క రూట్ ద్వారానే దక్షిణ కోస్తా రైల్వే ఖాతాలో ఏడాదికి రూ. 20 కోట్ల అదనపు ఆదాయం జమ కానుంది. సరుకు రవాణా వర్తకులను ఆకర్షించేందుకు రైల్వే శాఖ చేపడుతున్న ఇటువంటి మౌలిక సంస్కరణలు, సరుకు రవాణాదారులకు ఖర్చు తగ్గిస్తూనే, రైల్వే శాఖకు భారీ ఆదాయ మార్గాలను తెరిచిపెడుతున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks