అర్నబ్ తుపాను ప్రభావం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూపించింది. దీంతో రవాణాకు సంబంధించి జనాలు ఇబ్బందులు ఎదురుకోకుండా అధికారులు చర్యలో తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

విశాఖపట్నం డివిజన్ పరిధిలోని ఇచ్ఛాపురం - జాడపూడి సెక్షన్‌లో భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగిపొర్లుతోంది. బ్రిడ్జి నంబర్ 1052 (అప్) వద్ద రైలు పట్టాలపైకి, వంతెన కింద నీరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా దక్షిణ తీర రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్, వేరే మార్గాల్లోకి మళ్లించింది.
రద్దయిన రైళ్ల వివరాలు
అక్టోబర్ 29, 2026న నడవాల్సిన పలు రైళ్లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. రైలుanand
నెం. 58531: బ్రహ్మపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్, రైలు నెం. 18525: బ్రహ్మపూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రైలు నెం. 58532: విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు రైలు నెం. 68419 (భువనేశ్వర్ - పలాస) అక్టోబర్ 29న ఛత్రపూర్ వరకే నడుస్తుంది (ఛత్రపూర్ - పలాస మధ్య రద్దు చేశారు). రైలు నెం. 68420(పలాస - భువనేశ్వర్) అక్టోబర్ 29న పలాసకు బదులుగా ఛత్రపూర్ నుంచే బయలుదేరుతుంది. రైలు నెం. 18448 (జగదల్‌పూర్ - భువనేశ్వర్) అక్టోబర్ 28న బయలుదేరిన ఈ రైలును పలాస వరకే పరిమితం చేశారు.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
రైలు నెం. 68434(గుణుపూర్ - కటక్ ప్యాసింజర్) అక్టోబర్ 29న తెల్లవారుజామున 02:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఉదయం 7 గంటలకు ఆలస్యంగా బయలుదేరింది. ప్రభావానికి గురైన సెక్షన్ గుండా వెళ్లాల్సిన అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను విజయనగరం, తిట్లగఢ్, ఝార్సుగూడ, ఖరగ్పూర్ తదితర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.
పార్వతీపురం - హైదరాబాద్ దక్కన్
నవంబర్ 3న పార్వతీపురం నుంచి హైదరాబాద్ దక్కన్కు వన్‌వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ కోస్తా రైల్వే నడుపుతోంది. పండగలు, రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైలు నంబరు 08513 (పార్వతీపురం – హైదరాబాద్ దక్కన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్) 03.11.2026న పార్వతీపురం స్టేషన్ నుంచి ఉదయం 3:45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.
{{/usCountry}}నవంబర్ 3న పార్వతీపురం నుంచి హైదరాబాద్ దక్కన్కు వన్‌వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ కోస్తా రైల్వే నడుపుతోంది. పండగలు, రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైలు నంబరు 08513 (పార్వతీపురం – హైదరాబాద్ దక్కన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్) 03.11.2026న పార్వతీపురం స్టేషన్ నుంచి ఉదయం 3:45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైలు పార్వతీపురం, హైదరాబాద్ మధ్య ఉన్న పలు కీలకమైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. బొబ్బిలి, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్‌లో ఆగుతుంది.