పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. నవంబర్ 3న పార్వతీపురం-హైదరాబాద్ వన్ వే స్పెషల్ ట్రైన్
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను కారణంగా పలు రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే రద్దు చేసింది. అంతేకాదు.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్నింటిని దారి మళ్లిస్తుంది. మరోవైపు పార్వతీపురం – హైదరాబాద్ నడున నవంబర్‌లో స్పెషల్ ట్రైన్ ప్రకటించారు.
అర్నబ్ తుపాను ప్రభావం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూపించింది. దీంతో రవాణాకు సంబంధించి జనాలు ఇబ్బందులు ఎదురుకోకుండా అధికారులు చర్యలో తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

విశాఖపట్నం డివిజన్ పరిధిలోని ఇచ్ఛాపురం - జాడపూడి సెక్షన్‌లో భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగిపొర్లుతోంది. బ్రిడ్జి నంబర్ 1052 (అప్) వద్ద రైలు పట్టాలపైకి, వంతెన కింద నీరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా దక్షిణ తీర రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్, వేరే మార్గాల్లోకి మళ్లించింది.
రద్దయిన రైళ్ల వివరాలు
అక్టోబర్ 29, 2026న నడవాల్సిన పలు రైళ్లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. రైలుanand
నెం. 58531: బ్రహ్మపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్, రైలు నెం. 18525: బ్రహ్మపూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రైలు నెం. 58532: విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు రైలు నెం. 68419 (భువనేశ్వర్ - పలాస) అక్టోబర్ 29న ఛత్రపూర్ వరకే నడుస్తుంది (ఛత్రపూర్ - పలాస మధ్య రద్దు చేశారు). రైలు నెం. 68420(పలాస - భువనేశ్వర్) అక్టోబర్ 29న పలాసకు బదులుగా ఛత్రపూర్ నుంచే బయలుదేరుతుంది. రైలు నెం. 18448 (జగదల్‌పూర్ - భువనేశ్వర్) అక్టోబర్ 28న బయలుదేరిన ఈ రైలును పలాస వరకే పరిమితం చేశారు.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
రైలు నెం. 68434(గుణుపూర్ - కటక్ ప్యాసింజర్) అక్టోబర్ 29న తెల్లవారుజామున 02:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఉదయం 7 గంటలకు ఆలస్యంగా బయలుదేరింది. ప్రభావానికి గురైన సెక్షన్ గుండా వెళ్లాల్సిన అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను విజయనగరం, తిట్లగఢ్, ఝార్సుగూడ, ఖరగ్పూర్ తదితర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.
పార్వతీపురం - హైదరాబాద్ దక్కన్
నవంబర్ 3న పార్వతీపురం నుంచి హైదరాబాద్ దక్కన్‌కు వన్‌వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ కోస్తా రైల్వే నడుపుతోంది. పండగలు, రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైలు నంబరు 08513 (పార్వతీపురం – హైదరాబాద్ దక్కన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్) 03.11.2026న పార్వతీపురం స్టేషన్ నుంచి ఉదయం 3:45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు పార్వతీపురం, హైదరాబాద్ మధ్య ఉన్న పలు కీలకమైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. బొబ్బిలి, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్‌లో ఆగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


