...
...
Next Story

పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మీదుగా ప్రత్యేక రైళ్లు, హాల్ట్ లిస్ట్ ఇదే

శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల రద్దీ దృష్ట్యా దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శ్రీకాకుళం రోడ్, విజయవాడ, పుట్టపర్తి, యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Published on: Nov 14, 2026, 15:52:26 IST
Advertisement

శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలకు తరలివెళ్లే భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల మీదుగా కర్ణాటకలోని యలహంక (బెంగళూరు) వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో రౌండ్ ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైలు సర్వీసులుంటాయి.

శ్రీకాకుళం – యలహంక – శ్రీకాకుళం :

ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

  • రైలు నెం. 08555 (శ్రీకాకుళం రోడ్ - యలహంక) : నవంబర్ 20న (శుక్రవారం) సాయంత్రం 4:00 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 21 (శనివారం) మధ్యాహ్నం 3:00 గంటలకు యలహంక చేరుకుంటుంది.
  • రైలు నెం. 08556 (యలహంక - శ్రీకాకుళం రోడ్) : తిరుగు ప్రయాణంలో నవంబర్ 24న (మంగళవారం) సాయంత్రం 5:00 గంటలకు యలహంకలో బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 25 (బుధవారం) సాయంత్రం 5:15 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
  • చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

యలహంక – విజయవాడ – యలహంక రైలు :

ఈ రెండు ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని తరగతుల బోగీలు అందుబాటులో ఉంటాయి. వీటిలో సెకండ్ ఏసీ (2AC) - 2 బోగీలు, థర్డ్ ఏసీ (3AC) - 4 బోగీలు, స్లీపర్ క్లాస్ - 7 బోగీలు, జనరల్ సెకండ్ క్లాస్ - 4 బోగీలు ఉంటాయి. వీటితో పాటు దివ్యాంగుల కోసం ఒక సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగ్‌జన్ బోగీ, ఒక జనరేటర్ మోటార్ కారును జత చేశారు. సత్యసాయి జయంతి ఉత్సవాలకు వెళ్లే భక్తులు, సాధారణ ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks