దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పండుగ సెలవుల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్ల మీదుగా నడిచే ఈ రైళ్ల వివరాలు, వేళలు చూడండి.
విశాఖపట్నం – సంత్రగాచ్చి ప్రత్యేక రైళ్లు

రైలు నం. 08512(విశాఖపట్నం – సంత్రగాచ్చి) గురువారం (15.10.2026) రాత్రి 20:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.
ప్రధాన స్టేషన్లలో వేళలు: సింహాచలం (8:36), విజయనగరం (9:10), శ్రీకాకుళం రోడ్ (10:05), పలాస (11:00), బ్రహ్మపూర్ ( అర్ధరాత్రి 12:25), ఖుర్దా రోడ్ ( 3:00), భువనేశ్వర్ (3:40), ఖరగ్పూర్ (10).
రైలు నం. 08511 (సంత్రగాచ్చి – విశాఖపట్నం) తిరుగు ప్రయాణంలో ఈ రైలు శుక్రవారం (16.10.2026) మధ్యాహ్నం 2:55 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ప్రధాన స్టేషన్లలో వేళలు: ఖరగ్పూర్ (4:20), భువనేశ్వర్ (రాత్రి 10:45), ఖుర్దా రోడ్ (11:40), బ్రహ్మపూర్ ( తెల్లవారుజామున 2:28), పలాస (4:05), శ్రీకాకుళం రోడ్ (4:38), విజయనగరం (5:35), సింహాచలం (6:40).
తాంబరం – సంత్రగాచ్చి
06087 (తాంబరం – సంత్రగాచ్చి) ఈ నెల 16న రాత్రి 11 గంటలకు తాంబరంలో బయలుదేరి, మరుసటి రోజు (17న) మధ్యాహ్నం 2:53 గంటలకు దువ్వాడ చేరుకుని 2:55 గంటలకు బయలుదేరుతుంది. ఇది 18న ఉదయం 7:45 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.
రైలు నం. 06088 (సంత్రగాచ్చి – చెన్నై బీచ్) 18న ఉదయం 10:45 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు (19న) తెల్లవారుజామున 3 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. ఆపై 20న రాత్రి 7:00 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్కు చేరుకుంటుంది
తిరువనంతపురం నార్త్ – సంత్రగాచ్చి
{{/usCountry}}రైలు నం. 06088 (సంత్రగాచ్చి – చెన్నై బీచ్) 18న ఉదయం 10:45 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు (19న) తెల్లవారుజామున 3 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. ఆపై 20న రాత్రి 7:00 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్కు చేరుకుంటుంది
తిరువనంతపురం నార్త్ – సంత్రగాచ్చి
{{/usCountry}}రైలు నెంబర్ 06105(తిరువనంతపురం నార్త్ – సంత్రగాచ్చి) ఈ నెల 15న మధ్యాహ్నం 2:15 గంటలకు తిరువనంతపురం నార్త్లో బయలుదేరి, మరుసటి రోజు (16న) రాత్రి 10:33 గంటలకు దువ్వాడ చేరుకుని 10:35 గంటలకు బయలుదేరుతుంది. ఇది 17న మధ్యాహ్నం 1:45 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.
రైలు నెంబర్ 06106 (సంత్రగాచ్చి – తిరువనంతపురం నార్త్) 19న (సోమవారం) మధ్యాహ్నం 2:15 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4:18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆపై మంగళవారం ఉదయం 9:55 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది.