దసరా పండుగ రద్దీకి విశాఖ, దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు!

దసరా పండుగ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా కొన్ని రైళ్లు వెళ్తున్నాయి.

Published on: Oct 15, 2026, 15:34:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పండుగ సెలవుల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్ల మీదుగా నడిచే ఈ రైళ్ల వివరాలు, వేళలు చూడండి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం – సంత్రగాచ్చి ప్రత్యేక రైళ్లు

రైలు నం. 08512(విశాఖపట్నం – సంత్రగాచ్చి) గురువారం (15.10.2026) రాత్రి 20:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.

ప్రధాన స్టేషన్లలో వేళలు: సింహాచలం (8:36), విజయనగరం (9:10), శ్రీకాకుళం రోడ్ (10:05), పలాస (11:00), బ్రహ్మపూర్ ( అర్ధరాత్రి 12:25), ఖుర్దా రోడ్ ( 3:00), భువనేశ్వర్ (3:40), ఖరగ్‌పూర్ (10).

రైలు నం. 08511 (సంత్రగాచ్చి – విశాఖపట్నం) తిరుగు ప్రయాణంలో ఈ రైలు శుక్రవారం (16.10.2026) మధ్యాహ్నం 2:55 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ప్రధాన స్టేషన్లలో వేళలు: ఖరగ్‌పూర్ (4:20), భువనేశ్వర్ (రాత్రి 10:45), ఖుర్దా రోడ్ (11:40), బ్రహ్మపూర్ ( తెల్లవారుజామున 2:28), పలాస (4:05), శ్రీకాకుళం రోడ్ (4:38), విజయనగరం (5:35), సింహాచలం (6:40).

తాంబరం – సంత్రగాచ్చి

06087 (తాంబరం – సంత్రగాచ్చి) ఈ నెల 16న రాత్రి 11 గంటలకు తాంబరంలో బయలుదేరి, మరుసటి రోజు (17న) మధ్యాహ్నం 2:53 గంటలకు దువ్వాడ చేరుకుని 2:55 గంటలకు బయలుదేరుతుంది. ఇది 18న ఉదయం 7:45 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.

రైలు నం. 06088 (సంత్రగాచ్చి – చెన్నై బీచ్) 18న ఉదయం 10:45 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు (19న) తెల్లవారుజామున 3 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. ఆపై 20న రాత్రి 7:00 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్‌కు చేరుకుంటుంది

తిరువనంతపురం నార్త్ – సంత్రగాచ్చి

రైలు నెంబర్ 06105(తిరువనంతపురం నార్త్ – సంత్రగాచ్చి) ఈ నెల 15న మధ్యాహ్నం 2:15 గంటలకు తిరువనంతపురం నార్త్‌లో బయలుదేరి, మరుసటి రోజు (16న) రాత్రి 10:33 గంటలకు దువ్వాడ చేరుకుని 10:35 గంటలకు బయలుదేరుతుంది. ఇది 17న మధ్యాహ్నం 1:45 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.

రైలు నెంబర్ 06106 (సంత్రగాచ్చి – తిరువనంతపురం నార్త్) 19న (సోమవారం) మధ్యాహ్నం 2:15 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4:18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆపై మంగళవారం ఉదయం 9:55 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More