Srisailam Panchamathalu Abhishekam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో పవిత్ర కార్తిక మాసోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తోంది. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర రోజుల్లో శ్రీశైలానికి విచ్చేసే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎమ్. శ్రీనివాసరావు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కార్తీక మాసంలో ప్రధానాలయంలో నిర్వహించే శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. అయితే…. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అభిషేకం జరిపించుకోవాలని భావించే భక్తుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా శ్రీశైలంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.
రూ. 216 రుసుంతో….
సామాన్య భక్తులు సైతం సులభంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఈ సేవా రుసుమును కేవలం రూ. 216గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై దంపతులను గానీ లేదా ఒక వ్యక్తిని గానీ అభిషేకానికి అనుమతిస్తారు. భక్తులు తమ సౌకర్యం కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు డిజిటల్ విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కానీ, ఏపీటీఎస్ వారి అధికారిక వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా కానీ ఈ ఆర్జిత అభిషేక టికెట్లను సులభంగా పొందవచ్చు.
శ్రీశైల క్షేత్రంలో ఎంతో ప్రాశస్త్యం పొందిన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే పంచమఠాల్లో భక్తులు తమ అభీష్టం మేరకు ఏదైనా ఒక మఠాన్ని ఎంచుకుని ఈ ఆర్జిత అభిషేకాన్ని జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు.
శ్రీశైల చరిత్రలో పంచమఠాల విశిష్టత
శ్రీశైల ఆధ్యాత్మిక సంస్కృతి, వారసత్వంలో ఈ పంచమఠాలు శతాబ్దాలుగా ఎంతో ప్రధాన పాత్ర పోషించాయని ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి అధ్యక్షుడు రమేష్‌నాయుడు వివరించారు. ఇవి వ్యవహారంలో మఠాలుగా పిలువబడుతున్నప్పటికీ…. సాధారణ ఆలయాల మాదిరిగానే గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం వంటి పూర్తి ఆధ్యాత్మిక నిర్మాణ శైలిని కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.
{{/usCountry}}శ్రీశైల ఆధ్యాత్మిక సంస్కృతి, వారసత్వంలో ఈ పంచమఠాలు శతాబ్దాలుగా ఎంతో ప్రధాన పాత్ర పోషించాయని ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి అధ్యక్షుడు రమేష్‌నాయుడు వివరించారు. ఇవి వ్యవహారంలో మఠాలుగా పిలువబడుతున్నప్పటికీ…. సాధారణ ఆలయాల మాదిరిగానే గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం వంటి పూర్తి ఆధ్యాత్మిక నిర్మాణ శైలిని కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.
{{/usCountry}}గత కొన్ని శతాబ్దాలుగా శ్రీశైల క్షేత్ర ప్రశాంతతను కాపాడటంలో, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో, క్షేత్ర నిర్వహణలో ఈ మఠాలు ప్రముఖ భూమిక వహించాయి. ముఖ్యంగా ఈ పంచమఠాలు అత్యుత్తమ ధ్యానకేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి, దేవస్థానం కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని, పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.