...
...
Next Story

శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే తాజాగా దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Dec 3, 2025, 17:58:37 IST
Advertisement

శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

శ్రీశైలం మల్లన్న
శ్రీశైలం మల్లన్న

మల్లన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నవంబర్ 7వ తేదీ దాకా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనానికి రద్దు చేసింది దేవస్థానం. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శదర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అల్పాహారం, తాగునీరు, తదితర వసతులను కల్పిస్తున్నారు.

ఉచితంగా లడ్డూలు

మల్లన్న స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.

ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను దొరుకుతాయి. టికెట్లు తీసుకున్న ఈ భక్తులు కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చు.

గత నవంబర్ నెలలోనే శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks