...
...
Next Story

మల్లన్న భక్తులు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవాలి : శ్రీశైలం ఆలయ ఈఓ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి శ్రీశైలం దేవస్థానం దర్శనం, సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు అన్నారు. దీనిని మల్లన్న భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.

Published on: Dec 18, 2025 06:25 AM IST
By , Srisailam, Srisailam Temple, Srisailam Ticket Booking, Srisailam Online Seva Booking, Srisailam Darshan Ticket Booking Online, Srisailam Stay Booking, Srisailam Mallanna Devotees, Srisailam Latest News, Srisailam Sparsha Darshanam, శ్రీశైలం స్పర్శ దర్శనం, శ్రీశైలం టికెట్ బుకింగ్, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్, శ్రీశైలం
Prefer HTon Google
Advertisement

శ్రీశైలం ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈఓ) ఎం. శ్రీనివాసరావు ఆలయ సిబ్బంది, ఉద్యోగులు భక్తుల సౌకర్యార్థం ఆలయం అందించే ఆన్‌లైన్ సేవలను ప్రచారం చేయాలని కోరారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆన్‌లైన్ సేవల అమలుపై శ్రీనివాసరావు.. ఆలయ విభాగాధిపతులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు.

శ్రీశైలం మల్లన్న ఆలయం
శ్రీశైలం మల్లన్న ఆలయం

దర్శనం, వసతి కోసం భక్తులు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ఈఓ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సేవలను ఆన్‌లైన్‌లో చేసినట్లు తెలిపారు. 'స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం రూ.300, రూ,150 శీఘ్ర దర్శనం టిక్కెట్లు బుక్ చేయవచ్చు. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహా మృత్యుంజయ హోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన వంటి 14 ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.' అని ఈఓ చెప్పారు.

ప్రతి ఉద్యోగి, అధికారి భక్తులకు ఇబ్బంది లేని దర్శనం, వసతి కల్పించడానికి ఉద్దేశించిన ఆన్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించాలని ఈఓ శ్రీనివాసరావు చెప్పారు. స్వచ్ఛంద సేవకులు, శివసేవకులు కూడా విస్తృత ప్రచారం కల్పించడానికి ఆన్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవలపై బోర్డులను ఇన్‌స్టాల్ చేయాలని అధికారులకు సూచించారు.

ఆన్‌లైన్ సేవలను www.aptemples.ap.gov.in లేదా www.srisailadevasthanam.org లేదా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా మాత్రమే పొందవచ్చు. స్పర్శ దర్శనం, అర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు టికెట్ ప్రింటెడ్ కాపీని, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని తీసుకురావాలి. టికెట్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాలి, ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ను చూపించాలి. ఆన్‌లైన్ టికెట్‌ను స్కాన్ చేసిన తర్వాతే దర్శనం లేదా సేవలకు ప్రవేశం అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe