...
...
Next Story

శ్రీశైలం భక్తులకు అలర్ట్ - అక్టోబర్ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విడుదల! బుకింగ్ ప్రాసెస్ ఇలా…

శ్రీశైల దేవస్థానం అక్టోబర్ నెలకు సంబంధించిన స్పర్శ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేసింది. వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.

Published on: Sep 26, 2026, 09:21:53 IST
Advertisement

ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శ్రీశైల దేవస్థానం కీలకమైన అప్డేట్ అందించింది. 2026 అక్టోబర్ మాసానికి సంబంధించిన శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు మరియు వివిధ ఆర్జితసేవా టికెట్లను దేవస్థానం విడుదల చేసింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

వాట్సాప్‌లోనే 80 శాతం టికెట్లు….

శ్రీశైలం
శ్రీశైలం

ఈసారి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత వినూత్నమైన మార్పులు చేశారు. టికెట్ల కేటాయింపులో డిజిటల్ విధానానికి పెద్దపీట వేస్తూ, మొత్తం టికెట్లలో 80 ശాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'మనమిత్ర' వాట్సాప్ సేవ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. భక్తులు తమ మొబైల్ ఫోన్ల నుంచే సులభంగా టికెట్లు పొందేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మిగిలిన 20 శాతం టికెట్లను ఏపీటీఎస్ (APTS) అధికారిక వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చు. అయితే…. పరోక్ష సేవా టికెట్లను మాత్రం కేవలం 'మనమిత్ర' వాట్సాప్ ద్వారా మాత్రమే పొందే వీలుంది.

వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ ఎలా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మనమిత్ర' వాట్సాప్ నెంబరు 9552300009 కు మెసేజ్ పంపడం ద్వారా శ్రీశైలం శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టికెట్లను అత్యంత సులభంగా పొందే వీలు కల్పించారు. దీనితో పాటు గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కళ్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం సహా మొత్తం 14 రకాల ఆర్జిత సేవా టికెట్లను కూడా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారానే భక్తులు కైవసం చేసుకోవచ్చు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సహాయార్థం దేవస్థానం పలు ప్రాంతాల్లో వాట్సాప్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.

భక్తుల కోరిక మేరకు దేవస్థానం మరొక సడలింపు ఇచ్చింది. ఆర్జిత సేవలు ప్రారంభమయ్యే సమయానికి కేవలం ఒక గంట ముందు వరకు కూడా (టికెట్ల లభ్యతను బట్టి) 'మనమిత్ర' వాట్సాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

భక్తులు పాటించాల్సిన నియమాలు…

  • ఆన్‌లైన్ లేదా వాట్సాప్ ద్వారా టికెట్ పొందిన భక్తులు విధిగా ఆ టికెట్ ప్రింటవుట్ (హార్డ్ కాపీ) తెచ్చుకోవాలి.
  • టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
  • దేవస్థానం క్యూలైన్ల వద్ద టికెట్‌ను స్కాన్ చేసి, ఆధార్ గుర్తింపు కార్డుతో సరిచూసిన తర్వాత మాత్రమే ఆర్జిత సేవలు మరియు దర్శనాలకు అనుమతిస్తారు.
  • ఉచిత సర్వదర్శనం చేసుకునే భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 4:30 గంటల నుంచే క్యూలైన్లు అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ 11 నుండి 20 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం సేవల్లో పలు మార్పులు చేశారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి….

  • అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని రాత్రి వేళల్లో పూర్తిగా నిలిపివేశారు.
  • అమ్మవారి ఆర్జిత కుంకుమార్చనలు ఉదయం వేళల్లో నిర్వహించరు. కేవలం సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే ఆర్జిత కుంకుమార్చనలకు అనుమతిస్తారు.
  • దసరా ఉత్సవాల కారణంగా అక్టోబర్ 11 నుండి 20 వరకు గణపతి హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, నవావరణ పూజ, సువర్ణపుష్పార్చన, ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ, ప్రాతఃకాల సేవలను పూర్తిగా రద్దు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks