...
...
Next Story

Tirumala Navaratri Brahmotsavam 2026 : నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విష్వక్సేనుల వారి ఊరేగింపు, వైఖానస ఆమోక్తంగా అంకురార్పణ ఘట్టాలతో వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. ఈనెల 20వ తేదీతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Published on: Oct 12, 2026, 05:12:54 IST
Advertisement

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుండి 20వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సేనాధిప‌తి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్ల‌ను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.

ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పకవిమానం, అక్టోబరు 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం ఇలా ఉంది.

నేటి నుంచి వాహన సేవలు - పూర్తి షెడ్యూల్ :

  • అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు, పెద్దశేష వాహన సేవ రాత్రి 7 గంటలకు ఉంటుంది.
  • అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు, హంస వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు, ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు, సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
  • అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు, పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు, గజ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks