AP Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకటన వెలువడే రోజే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైన స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మంగళవారం ఉదయం 11:30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని 20 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు.
పంచాయతీ, ప్రాదేశిక (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు వీలుగా కమిషన్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అయితే బుధవారం(అక్టోబర్ 14) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) తక్షణమే అమల్లోకి రానుంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మూడో రోజు నుంచి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కేవలం 16 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మొత్తం 14 రోజుల్లోనే పూర్తి చేసేలా అధికారులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. వీటన్నింటికి వేర్వురుగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. !
గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.
- పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.
- పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు.
- పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.