ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు పులులు, ఇతర అరుదైన వన్యప్రాణుల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా పేరుగాంచిన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభివృద్ధి, పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ జీవో ఎంఎస్ నంబర్ 42ను అధికారికంగా విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 (చట్టం సెక్షన్ 38U)లోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్‌పర్సన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు. వైస్ చైర్‌పర్సన్‌గా డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, మెంబర్ సెక్రటరీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) అండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఉంటారు.
ఈ కమిటీలో గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, సోషల్ జస్టిస్ తదితర కీలక శాఖల విభాగాల అధికారులు భాగస్వామ్యులుగా ఉంటారు. వీరితో పాటు వన్యప్రాణి సంరక్షణ నిపుణులు ఎన్. లక్ష్మీరాణి, మూర్తి కాంతిమహంతి, గిరిజన మండలుల ప్రతినిధులను కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
టైగర్ రిజర్వ్ పరిధిలో పులులు, చిరుతలు, ఇతర క్రూర మృగాల సంఖ్యను పెంచడంతో పాటు, వాటికి ప్రాథమిక ఆహారంగా ఉండే జంతువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం స్టీరింగ్ కమిటీ ప్రధాన లక్ష్యం. అటవీ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల మధ్య నిరంతర సమన్వయాన్ని ఏర్పరిచి అటవీ నేరాలను అరికట్టేలా చూడనుంది. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు తదితర గిరిజన తెగల హక్కులకు భంగం కలగకుండా, వారి సాయంతోనే అడవుల సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.
నల్లమలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అత్యంత విస్తీర్ణమైన టైగర్ రిజర్వ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఇక్కడ వన్యప్రాణులు నివసిస్తున్నాయి.
{{/usCountry}}నల్లమలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అత్యంత విస్తీర్ణమైన టైగర్ రిజర్వ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఇక్కడ వన్యప్రాణులు నివసిస్తున్నాయి.
{{/usCountry}}కృష్ణానది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తూ జీవవైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. వేటగాళ్ల బెడద, ఆక్రమణలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతో వన్యప్రాణుల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు నేరుగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తుండటంతో ప్రాజెక్ట్ టైగర్ నిధుల వినియోగం, సంరక్షణ చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.