ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆస్తి వ్యామోహానికి, సవతి తల్లి కక్షసాధింపునకు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. ఎంతో ఇష్టంగా తింటారనే నెపంతో, చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి ఇచ్చి, నమ్మించి గొంతు కోసింది ఆ కిరాతకురాలు. కలుషిత ఆహారం తిని చనిపోయారంటూ నిందితులు అల్లిన కల్లబొల్లి కథలను ఛేదించి, కొత్తపేట పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.

పోలీసు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన స్వర్ణ, నెహ్రూనగర్ నివాసి రాంబాబులు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాత్విక్ (10), నిత్య (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు మేరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నారుల జీవితాల్లోకి పెద్ద తుపాను వచ్చిపడింది. తల్లి లేని లోటు తెలిసిరాకుండా పెరగాల్సిన ఆ చిన్నారుల జీవితం మరో మలుపు తిరిగింది.
మేరీకి ఇదివరకే వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. రెండో భార్యగా ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి సాత్విక్, నిత్యలను ఆమె కంటిపాపలా చూడకపోగా, తీవ్ర వేధింపులకు గురిచేసేది. రాంబాబు ఆస్తి అంతా మొదటి భార్య పిల్లలకే చెందుతుందేమోనన్న భయంతో, ఆ పసివారిని ఇల్లు విడిచి వెళ్లిపోవాలని బెదిరించేది.
పిల్లలను శాశ్వతంగా వదిలించుకోవాలని కుట్ర పన్నిన మేరీ.. ఈ నెల 20వ తేదీన ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి తినిపించింది. అయితే తొలిరోజు పిల్లలకు ఏమీ కాకపోవడంతో మరుసటి రోజు కూడా కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేసింది.
ఈ క్రమంలో దసరా ఉత్సవాల్లో భోజనం తిన్న తర్వాత చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడుతుందనే భయంతో మేరీ తన భర్త రాంబాబుకు విషయాన్ని చెప్పింది. ఆ తరవాత బాధ్యతాయుతంగా కాపాడాల్సిన తండ్రి కూడా భార్య క్రూరత్వానికి సహకరిస్తూ, పిల్లలు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారంటూ ఆసుపత్రుల చుట్టూ తిప్పే నాటకానికి తెరతీశాడు.
{{/usCountry}}ఈ క్రమంలో దసరా ఉత్సవాల్లో భోజనం తిన్న తర్వాత చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడుతుందనే భయంతో మేరీ తన భర్త రాంబాబుకు విషయాన్ని చెప్పింది. ఆ తరవాత బాధ్యతాయుతంగా కాపాడాల్సిన తండ్రి కూడా భార్య క్రూరత్వానికి సహకరిస్తూ, పిల్లలు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారంటూ ఆసుపత్రుల చుట్టూ తిప్పే నాటకానికి తెరతీశాడు.
{{/usCountry}}తీవ్ర అస్వస్థతకు గురైన సాత్విక్, నిత్యలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 24న ప్రాణాలు విడిచారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి, ఎస్సై హనుమంతరావు రంగంలోకి దిగారు. చిన్నారుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన సీఐ, అది ఆహారం వికటించడం వల్ల జరిగింది కాదని, పక్కాగా విషప్రయోగమేనని అనుమానించారు.
సందేహంతో వెంటనే రాంబాబు నివాసంలో సోదాలు నిర్వహించగా, ఇంట్లో ఎలుకల మందు లభ్యమైంది. పోలీసుల శైలిలో విచారించడంతో మేరీ తన దారుణ కృత్యాన్ని, రాంబాబు దానికి సహకరించిన తీరును అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దారుణానికి ఒడిగట్టిన భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆస్తి కోసం పసివాళ్లను బలితీసుకున్న ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.