దిమ్మతిరిగేలా తెలంగాణలో దసరా లిక్కర్ సేల్స్.. ఎన్ని కోట్ల అమ్మకాలు తెలుసా?
తెలంగాణలో ఈసారి దసరాకు మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. కేవలం 19 రోజుల్లో లెక్కలు చూసుకుంటే.. రెండు వేల కోట్లు రూపాయలకు పైగానే మద్యం అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో విజయదశమి వేడుకల వేళ మద్యం విక్రయాలు నయా రికార్డులను సృష్టించాయి. దసరా పండుగ సందర్భంగా మందుబాబులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు.. కేవలం 19 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది దసరా సీజన్‌తో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాల్లో ఏకంగా 37.02 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

దసరా పండుగకు ముందు రోజైన అక్టోబర్ 19న రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. ఒక్క రోజే ఏకంగా రూ. 303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్కరోజు విక్రయాల్లో ఏకంగా 801.90 శాతం అసాధారణ పెరుగుదల కనిపించింది.
తెలంగాణ ప్రజల్లో బీర్ల వినియోగం ఎప్పుడూ ఎక్కువేనని ఈ దసరా విక్రయాలు మరోసారి నిరూపించాయి. పండుగ ముందున్న నాలుగు రోజుల్లోనే హార్డ్ లిక్కర్: 6,83,000 కేసులు, బీర్లు: 10,44,000 కేసులు విక్రయమయ్యాయి. రాష్ట్రంలోని 17 ప్రధాన మద్యం డిపోల నుంచి సరఫరా అయ్యే స్టాక్ ద్వారా.. వ్యాపారులు 2,620 లైసెన్స్డ్ వైన్ షాపులు, దాదాపు 1,200 బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల ద్వారా ఈ అమ్మకాలను సాగించారు.
అక్టోబర్ 19న దుర్గాష్టమి, మరుసటి రోజు విజయదశమి రావడంతో తెలంగాణ ఇళ్లల్లో నాన్-వెజ్ విందులు, దావత్‌లు ఊపందుకున్నాయి. దావత్‌ల కోసం ముందుగానే మద్యాన్ని నిల్వ చేసుకున్నారు. దసరా సెలవుల కారణంగా ప్రధాన నగరాల నుంచి లక్షలాది మంది ప్రజలు సొంత ఊళ్లకు తరలివెళ్లారు. దీంతో గ్రామాల్లో స్నేహితులు, బంధువుల కలయికలతో వైన్‌షాపులు కిటకిటలాడాయి.
పండుగ రోజుల్లో డిమాండ్ పెరిగి మద్యం కొరత ఏర్పడకుండా వైన్‌షాపు నిర్వాహకులు, వ్యాపారులు డిపోల నుంచి బల్క్‌గా స్టాక్ కొనుగోలు చేయడం కూడా ఈ రికార్డు విక్రయాలకు కారణమైంది. అక్టోబర్ తొలి వారంలో అమ్మకాలు కొద్దిగా మందకొడిగా సాగినప్పటికీ, రెండో వారం నుంచి ఊపందుకుని అక్టోబర్ 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మద్యం అమ్మకాలు ఏకంగా రూ. 2,000 కోట్ల మార్క్‌ను దాటేశాయి. అక్టోబర్ 16 నాటికి రూ. 1,527.85 కోట్ల క్యుమ్యులేటివ్ సేల్స్ నమోదయ్యాయి.
ఈ గణాంకాలు కేవలం అక్టోబర్ 19వ తేదీ వరకు నమోదైన విక్రయాల ఆధారంగా రూపొందించిన నివేదిక మాత్రమేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పండుగ తర్వాతి రోజుల్లో కూడా అమ్మకాల ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు. సాధారణంగా పండుగ రోజుల్లో హార్డ్ లిక్కర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే అంచనాలను తిరగరాస్తూ.. ఈసారి బీర్ల విక్రయాలే భారీగా జరిగాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


