...
...
Next Story

Godavari Railway Station : ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - గోదావరి స్టేషన్‌లో ఈ 3 రైళ్ల స్టాపేజీ రద్దు! పూర్తి వివరాలు

Godavari Railway Station : గోదావరి పుష్కరాల పనుల నేపథ్యంలో కీలక అలర్ట్ జారీ అయింది. గోదావరి (GVN) రైల్వే స్టేషన్‌లో మూడు మెము (MEMU) రైళ్ల నిలుపుదలను తాత్కాలికంగా రద్దైంది. జూన్ 26 నుంచి 45 రోజుల పాటు ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Published on: Jun 26, 2026, 13:14:30 IST
Advertisement

Godavari Railway Station : గోదావరి పుష్కరాల పనుల కారణంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. రాజమండ్రి సమీపంలోని గోదావరి (GVN) రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో…. జూన్ 26 నుంచి రాబోయే 45 రోజుల పాటు మూడు మెము (MEMU) రైళ్ల నిలుపుదలను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ 3 రైళ్లకు స్టాపేజీ రద్దు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్
రైల్వే ప్రయాణికులకు అలర్ట్

గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆగకుండా నేరుగా వెళ్లే ఆ మూడు రైళ్ల వివరాలను దక్షిణ కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాల్సిన రైళ్ల వివరాలు ఇవే:

  • కాకినాడ పోర్ట్ – విజయవాడ మెము ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 17258): ఈ రైలు రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే నిత్య ప్రయాణికులకు ఎంతో కీలకం. అయితే 45 రోజుల పాటు ఇది గోదావరి స్టేషన్‌లో ఆగదు.
  • రాజమండ్రి – విజయవాడ మెము (రైలు నంబర్: 67201): ఈ ఉదయకాలపు సర్వీసు కూడా గోదావరి స్టేషన్‌లో నిలవదు.
  • రాజమండ్రి – విజయవాడ మెము (రైలు నంబర్: 67261): ఈ మధ్యాహ్న సర్వీసు కూడా నిర్ణీత గడువు ముగిసే వరకు గోదావరి స్టేషన్‌లో ఆగకుండానే ముందుకు సాగుతుంది.

ప్రయాణికులు సహకరించాలి: దక్షిణ కోస్తా రైల్వే

రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గోదావరి స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పన, లూప్ లైన్లు, ట్రాక్ ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనుల దృష్ట్యా రైళ్ల రాకపోకలకు మరియు ప్రయాణికుల భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ తాత్కాలిక మార్పులు చేశారు.

గోదావరి పుష్కరాలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పవిత్రమైనవి కావడంతో భవిష్యత్తులో వచ్చే భారీ భక్త జనాభాను తట్టుకునేందుకు వీలుగా గోదావరి స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్లాట్‌ఫారాల పొడిగింపు, భద్రతా ప్రమాణాల మెరుగుదల, రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు వీలుగా లూప్ లైన్ల ఆధునీకరణ వంటి ఇంజనీరింగ్ పనులను ఈ 45 రోజుల్లో పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రూట్ ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను అనుసంధానించే అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ప్రయాణికులు ముందే అప్రమత్తమవ్వడం అవసరం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe