ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామలయం నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ భూమిలో ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఏవైనా సరైన అభ్యంతరాలు ఉంటే, కొత్తగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఆ ప్రదేశంలో 80 ఏళ్లకు పైగా రామ మందిరం ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయని, ఆకివీడులో రామలయం నిర్మాణానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ వివాదానికి సంబంధించి.. గతంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు లోబడి ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి తప్పులేదని వెల్లడించింది. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లో ఎటువంటి సత్యాలు లేవని కోర్టు పేర్కొంది. పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కలెక్టర్ ఇచ్చిన ఎన్‌ఓసీ సరైనదేనని, దానిలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు వెల్లడించింది. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆకివీడులో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. న్యాయస్థానం తీర్పుతో స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సుప్రీం కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు.
'ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్! రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది! సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!! జై శ్రీ రామ్!' అని రఘురామ కృష్ణ రాజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


