శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మెటీరియల్స్ అండ్ మినరల్ ప్రాసెసింగ్‌లో M.Tech కోర్సు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎంటెక్‌లో కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. 20 సీట్లతో మెటీరియల్స్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) తన కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 'మెటీరియల్స్ అండ్ మినరల్స్ ప్రాసెసింగ్'లో ఒక ప్రత్యేకమైన ఎం.టెక్ కోర్సును ప్రకటించింది. సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్‌గా తీసుకురానున్నట్టుగా వెల్లడించింది.

'భవిష్యత్ సాంకేతికతలకు, ప్రపంచ ఆర్థిక భద్రతకు కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలు పునాదిగా నిలుస్తున్న తరుణంలో, వేగంగా మారుతున్న ప్రపంచ పారిశ్రామిక పరిసరాలకు ఇంజనీరింగ్ పట్టభద్రులను సిద్ధం చేసేందుకే మా ఎం.టెక్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT-H) సహకారంతో దీనిని అందిస్తున్నాం. ఈ రంగంలో ఖనిజాల లభ్యతతో పాటు ఖనిజ వనరులను వెలికితీయడం, శుద్ధి చేయడం, పునరుద్ధరించడం, వాటికి విలువను జోడించడం వంటి సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమవుతున్నాయి.' అని SVU వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింగ రావు అన్నారు.
ప్రపంచం ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, బ్యాటరీ నిల్వ, సెమీకండక్టర్ టెక్నాలజీలు, ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్, రక్షణ, అధునాతన తయారీ రంగాల వైపు అపూర్వమైన పరివర్తనను చూస్తున్న తరుణంలో ఈ కోర్సు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సాంకేతికతలలో దాదాపు ప్రతి దాని వెనక ఖనిజాలు, అధునాతన పదార్థాలతో కూడిన ఒక సంక్లిష్టమైన చైన్ సిస్టమ్ ఉందని ప్రొఫెసర్ అన్నారు.
విశ్వవిద్యాలయాలు విద్యార్థులను కేవలం నేటి ఉద్యోగాలకే కాకుండా.. రాబోయే దశాబ్దాలను తీర్చిదిద్దబోయే పరిశ్రమలకు కూడా సిద్ధం చేయాలని అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల విద్యావిధానంలోనే సమూల మార్పు రావాల్సిన అవసరాన్ని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింగ రావు నొక్కి చెప్పారు.
భారతదేశం కీలక ఖనిజాల అన్వేషణకు స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ రంగంలో డాక్టరేట్ పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలను అందిస్తుంది.
ఈ కోర్సులో రూ.1,45,170 ప్రోగ్రామ్ ఫీజుతో ఇరవై సీట్లు ఉన్నాయి. ప్రవేశం APPGECET 2026 ద్వారా జరుగుతుంది. ప్రవేశం, కౌన్సెలింగ్ వివరాలను www.cap.apcfss.inలో చూడవచ్చు. మరింత సమాచారం కోసం, ఆసక్తిగల విద్యార్థులు SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన డాక్టర్ బి.శరత్ బాబును +919849568083 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


