విజయవాడ ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు.. అభిమానుల కోలాహలం
CM Vijay In Andhra : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు. ఆయన అభిమానులతో విజయవాడ నగరం కోలాహలంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. చెన్నై నగరం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, ఆలయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఏపీకి రావడం ఇదే తొలిసారి కావడంతో విజయవాడ నగరంతో పాటు గన్నవరం విమానాశ్రయ ప్రాంగణం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. సీఎం విజయ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయం వెలుపలకు వచ్చిన విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెంట అభిమానులు ఉత్సాహంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విమానాశ్రయం నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం విజయ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ.. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ అన్నపూర్ణా దేవి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ మంటపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం దుర్గగుడి అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, కనకదుర్గమ్మ చిత్రపటాన్ని సీఎం విజయ్‌కి అందజేశారు.
దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం సీఎం విజయ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి బయలుదేరి వెళ్లారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయం, ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించేందుకు వేదిక కానుంది.
మరోవైపు మంగళవారం రాత్రి విజయవాడ నగరంలో వైభవంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం విజయ్ పాల్గొంటారు. తమిళనాడు సీఎం తొలిసారిగా ఏపీకి వచ్చి ఇటు దైవదర్శనం, అటు రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా దర్శనం పూర్తయ్యేలా, అభిమానుల రద్దీని నియంత్రించేలా విజయవాడ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


