ఇవాళ ఏపీకి తమిళనాడు సీఎం విజయ్ - చంద్రబాబుతో కీలక సమావేశం!
ఇవాళ తమిళనాడు సీఎం విజయ్ అమరావతి రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. చెన్నై తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా నదీ జలాలను విడుదల చేయాలని కోరనున్నారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

సీఎం విజయ్ టూర్ షెడ్యూల్….
తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం(ఇవాళ) మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా వెళ్లి సాయంత్రం 4:15 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అధికారిక చర్చల్లో పాల్గొంటారు. తెలుగు గంగా ప్రాజెక్ట్ కింద చెన్నై నగరానికి రావాల్సిన కృష్ణా నీటిని వేగంగా విడుదల చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారిన గోదావరి - కృష్ణా - కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడతారని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం విజయ్…. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం విజయవాడలో జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' సాంస్కృతిక వేడుకలకు ఆయన హాజరవుతారు. సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి (కనకదుర్గ) వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రికే ఆయన తిరిగి చెన్నైకి చేరుకుంటారు.
మరోవైపు….. తమిళనాడు ముఖ్యమంత్రి ఏపీ పర్యటనపై సామాజిక, పర్యావరణ సమస్యలపై పనిచేస్తున్న 'పూవులగిన్ నన్బర్గల్' సంస్థ ప్రతినిధి జీ సుందర్రాజన్ స్పందించారు. కండలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తక్షణమే విడుదల చేయడంతో పాటు, తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం నుంచి నీటిని కేటాయించేలా ఏపీ ప్రభుత్వాన్ని కోరాలని ఆయన సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేశారు.
చెన్నై నగరం ఎదుర్కొంటున్న ప్రస్తుత తాగునీటి ఎద్దడి, పూండితో సహా ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి మట్టాలు, ఈ ఏడాది ఇప్పటివరకు అందిన కృష్ణా నీటి పరిమాణానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను సీఎం విజయ్… ఏపీ సీఎం ముందుంచాలని కోరారు. కండలేరు నుంచి వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసేలా చంద్రబాబును ఒప్పించాలని సుందర్రాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

